/rtv/media/media_files/2026/04/10/love-insurance-kompany-2026-04-10-10-21-33.jpg)
Love Insurance kompany
Love Insurance kompany: ప్రదీప్ రంగనాథన్ నటించిన కొత్త సినిమా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (LIK) ఈరోజు థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. వినేశ్ శివన్ దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ సినిమా లో కృతీ శెట్టి హీరోయిన్‌గా నటించగా, ఎస్‌జే సూర్య ముఖ్య పాత్రలో కనిపిస్తున్నారు.
అయితే రిలీజ్ రోజునే ఈ సినిమాకు చిన్న ఇబ్బంది ఎదురైంది. తెలుగురాష్ట్రాల్లో ఉదయం షోలు రద్దు కావడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. ఈ సమస్యకు ప్రధాన కారణం KDM (కీ డెలివరీ మెసేజ్) ఆలస్యం కావడం అని సమాచారం. డిజిటల్ సినిమాలను థియేటర్లలో ప్రదర్శించడానికి ఈ KDM చాలా అవసరం.
హైదరాబాద్‌లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో కూడా షోలు నిలిపివేశారు. ఇదే సమస్య కొన్ని ఇతర ప్రాంతాల్లో కూడా కనిపించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఉదయం నుంచే సినిమా చూడాలని ప్లాన్ చేసిన ప్రేక్షకులు ఈ ఆలస్యంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా దీనిపై చర్చలు జరుగుతున్నాయి.
ఈ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందో, సాధారణ షోలు ఎప్పటి నుంచి మొదలవుతాయో చూడాలి.
Follow Us