/rtv/media/media_files/2025/02/03/jzEwvoITKgDQba5btffc.jpg)
lavanya mastan Photograph: (lavanya mastan)
ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా మస్తాన్ సాయి కేసు గురించే ఎక్కువగా కనిపిస్తోంది. అయితే రాజ్ తరుణ్ భార్యనంటూ చెప్పుకున్న లావణ్య.. మస్తాన్ సాయి మీద కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఒక హార్డ్ డిస్క్‌ను పోలీసులకు లావణ్య అందజేసింది. అందులో హీరో నిఖిల్ ప్రైవేట్ వీడియోలు కూడా ఉన్నాయని తెలిపింది. ఈ విషయంపై గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే ఈ విషయంపై హీరో నిఖిల్ స్పందించాడు.
ఇది కూడా చూడండి: Jeeth Adani: గుజరాతీ సంప్రదాయంలో వేడుకగా గౌతమ్ అదానీ చిన్న కుమారుడి వివాహం!
కావాలనే తప్పుగా చూపిస్తున్నారని..
తనపై జరుగుతున్న ఈ అసత్య ప్రచారాన్ని కూడా ఖండించాడు. కేవలం ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి ఉన్న వీడియోలని, వాటిని వీరంతా తప్పుగా చూపిస్తున్నారని నిఖిల్ అన్నాడు. కార్తికేయ 2 సక్సెస్ మీట్ తర్వాత డిన్నర్ పార్టీ జరిగింది. వాటి వీడియోలు అని, అందులో కూడా ఉన్నది మా కుటుంబ సభ్యులే అని నిఖిల్ తెలిపాడు. పోలీసులకు కూడా వాస్తవం ఏంటనే విషయం తెలుసని నిఖిల్ స్పష్టం చేశాడు.
ఇది కూడా చూడండి: Horoscope Today:నేడు ఈ రాశి వారికి ఆదాయం పదింతలు అవుతుంది...మీ రాశేనేమో చూసుకోండి మరి!
ఇదిలా ఉండగా మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో దాదాపుగా 200 వరకు అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు, న్యూడ్ వీడియో, ఆడియో కాల్స్ ఉన్నట్లుగా పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేసింది. ఆ హార్డ్ డిస్క్‌ను కూడా అందజేసింది. డ్రగ్స్ ఇచ్చి లావణ్యతో పాటు పలువురు అమ్మాయిల న్యూడ్ వీడియోలు తీసిన మస్తాన్ సాయి ఎంతోమందిని బ్లాక్ మెయిల్ చేసినట్లు తెలిపింది. తన దగ్గర న్యూడ్ వీడియోలు ఉన్నాయని చాలామంది దగ్గర డబ్బులు తీసుకునేవాడని, తర్వాత వారి ముందు డిలీట్ చేసినట్టు నటించేవాడని సమాచారం. అయితే, అంతకుముందే వాటిని పె డ్రైవ్, హార్డ్ డిస్క్ లో స్టోర్ చేసుకునేవాడని తెలుస్తోంది. ఎవరైనా డబ్బులు ఇవ్వకపోతే లైంగికంగా వాడుకుంటూ అప్పుడు కూడా రహస్యంగా వీడియోలు తీసేవాడని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే హీరో నిఖిల్ ప్రైవేట్ వీడియోలు ఉన్నాయని తెలిపింది. దీంతో నిఖిల్ ఈ విషయంపై తాజాగా స్పందించాడు.
ఇది కూడా చూడండి:Delhi Assembly Results: ఢిల్లీ పీఠం ఎక్కేదెవరు..నేడే అసెంబ్లీ ఫలితాలు!