/rtv/media/media_files/2024/11/21/mTXrUuUc9FIBOpDAzjvS.jpg)
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కు సంబంధించి గత కొద్ది రోజుల నుంచి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శివకార్తికేయన్ కొత్త సినిమాలో విశాల్ విలన్ రోల్ చేస్తున్నాడని, కథ నచ్చే విశాల్ ఈ డెసిషన్ తీసుకున్నట్లు న్యూస్ వచ్చింది. దీనిపై తాజాగా విశాల్ క్లారిటీ ఇచ్చారు. అవన్నీ అవాస్తవాలని, అందులో ఎలాంటి నిజం లేదని అన్నారు.
' ప్రస్తుతానికి నేను విలన్ పాత్రలు చేయాలనుకోవడం లేదు. నా తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టాను. భారీస్థాయిలో వాటిని తెరకెక్కించాలని.. ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతిని అందించాలని అనుకుంటున్నా. ఈ వార్తలు ఎవరు సృష్టిస్తున్నారో, ఎక్కడినుంచి పుట్టుకొస్తున్నాయో నాకు తెలుసు.
ఇది కూడా చదవండి: Lagacharla: మహబూబాబాద్‌లో హైటెన్షన్.. ఎస్పీ క్యాంపుపై దాడి!
Vishal in today's article about #Sivakarthikeyan's #SK25 Villain Rumor:
— AmuthaBharathi (@CinemaWithAB) November 21, 2024
"Villain? Certainly not. I am focused on my lineup and those are big. Also, I am aware where this talk mill originated from. I guess, it is their wish to see me as a villain after I have put in 20 years of… pic.twitter.com/z6egrG8n8Y
ఇది కూడా చూడండి: షమీ-మంజ్రేకర్ మధ్య ఐపీఎల్ వివాదం.. దాన్ని దాచుకోమంటూ కౌంటర్స్!
నెగిటివ్ రోల్స్ చేయాలని లేదు..
నన్ను విలన్‌గా చూడాలనేది వారి కోరిక అనుకుంటా. ప్రస్తుతానికి నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ చేయాలని లేదు. కాబట్టి వాళ్లను కాస్త శాంతించమని చెబుతా..' క్లారిటీ ఇచ్చారు. విశాల్ ఇచ్చిన క్లారిటీతో శివకార్తికేయన్ కొత్త సినిమాలో ఆయన ప్రతి నాయకుడి పాత్ర చేస్తున్నారనే వార్తలకు చెక్ పడింది.
ఇక విశాల్ సినిమాల విషయానికొస్తే.. గత ఏడాది 'మార్క్ ఆంటోని' మూవీతో భారీ సక్సెస్ అందుకున్నాడు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం కోలీవుడ్ లో వందకోట్లు కలెక్ట్ చేసింది. తెలుగులోనూ బాగానే ఆడింది. దీని తర్వాత వచ్చిన 'రత్నం' మూవీ మాత్రం పరాజయం పాలైంది. ప్రస్తుతం విశాల్ 'డిటెక్టివ్' సీక్వెల్ లో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కు డైరెక్టర్ కూడా ఆయనే కావడం విశేషం.
ఇది కూడా చదవండి: కాగ్ అధిపతిగా తెలుగు అధికారి.. సంజయ్‌మూర్తి అరుదైన ఘనత!
ఇది కూడా చూడండి: AR Rahman : అసిస్టెంట్ తో రెహమాన్ ఎఫైర్.. అందుకే విడాకులు..?