మధ్యాహ్నం 3 గంటలకే చీకటి పడే ఊరు..ట్విస్టులతో సాగిన 'క' ట్రైలర్ కిరణ్ అబ్బవరం 'క' మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ సస్పెన్స్ ఎలివెంట్స్ తో సాగుతూ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. యాక్షన్ సీన్స్ లో కిరణ్ అబ్బవరం అదరగొట్టేశాడు. బీజియం ట్రైలర్ ను నెక్స్ట్ లెవెల్ లో ఎలివేట్ చేసింది. By Anil Kumar 25 Oct 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం పాన్ ఇండియా స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సుజిత్-సందీప్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'క'. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ సస్పెన్స్ ఎలివెంట్స్ తో సాగుతూ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. 'ఈ ఊరేంటి చాలా విచిత్రంగా ఉంది. మధ్యాహ్నం మూడు గంటలకే చీకటి పడిపోతుందని' హీరో చెప్పే డైలాగు తో ట్రైలర్ మొదలైంది. మా ఊరు చుట్టూ ఎత్తెన కొండలుంటాయి. కొండల మధ్యలో మా ఊరుంటుంది. మధ్యాహ్నం మూడయ్యే సరికి సూర్యుడు కొండల వెనక్కి వెళ్లిపోయి.. ఆ నీడ మా ఊరి మీద పడి 3 గంటలకే చీకటి పడిపోతుందబ్బాయి.. అంటూ సాగుతున్న సంభాషణలు క్యూరియాసిటీ ఆసక్తిని పెంచాయి. Also Read : 'లవ్ రెడ్డి' సినిమా నటుడిపై ప్రేక్షకురాలి దాడి.. బండబూతులు తిడుతూ ఉత్తరంలో ఏముంది..? చీకటి వలయం.. గందరగోళం.. ఏప్రిల్ 22 1977 ఆ రోజు నీకొచ్చిన ఉత్తరాన్ని తెరిచి చదివావు. అందులో ఏముంది.. అంటూ ఓ అజ్ఞాత వ్యక్తి అడుగుతున్నాడు. ఇంతకీ ఉత్తరంలో ఏముంది..? వాసుదేవ్ ఆ ఉత్తరాన్ని చదివి ఏం చేశాడనేది ఈ సినిమాలో చూపించనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇక ట్రైలర్ లో సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ ఎలివెంట్స్ భారీగానే పెట్టినట్లు తెలుస్తోంది. యాక్షన్ సీన్స్ లో కిరణ్ అబ్బవరం అదరగొట్టేశాడు. ఈ సినిమాలో చాలా డిఫరెంట్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఇక సామ్ సీఎస్ అందించిన బీజియం ట్రైలర్ ను నెక్స్ట్ లెవెల్ లో ఎలివేట్ చేసింది.1970 ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణగిరి గ్రామం నేపథ్యంలో సాగే కథగా ఈ చిత్రం ఉండబోతుంది. సినిమాలో తాన్వి రామ్, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. Also Read : ట్రెండింగ్‌లో ఉంచినందుకు మీ అందరికీ థ్యాంక్స్.. జానీ మాస్టర్ షాకింగ్ పోస్ట్ #kiran-abbavaram #ka మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి