/rtv/media/media_files/2025/02/28/CrBx1GhU0hE835PAEiaJ.jpg)
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ గుడ్ న్యూస్ చెప్పింది. తాను తల్లిని కాబోతున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దీంతో ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ సెలబ్రేటీలు అభినందనలు తెలుపుతున్నారు.
Siddharth Malhotra and Kiara Advani announce their pregnancy! 😍
— No One Cares (@Cares_One_No) February 28, 2025
Congratulations to the beautiful couple! ❤️ #SidKiara #SiddharthMalhotra #KiaraAdvani pic.twitter.com/3UizXekGZC
రెండు సంవత్సరాల తర్వాత
కాగా కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా 2023 ఫిబ్రవరి 7వ తేదీన జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో పెళ్లి చేసుకున్నారు. వివాహం అయిన రెండు సంవత్సరాల తర్వాత, ఈ జంట తొలిసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. ప్రస్తుతం కియారా త్వరలో రణవీర్ సింగ్ తో కలిసి డాన్ 3 లో కనిపించనుంది. మరోవైపు, సిద్ధార్థ్ ప్రస్తుతం పరమ్ సుందరి షూటింగ్ లో ఉన్నాడు. తెలుగులో భరత్ అను నేను, వినయ విధేయ రామ, గేమ్ ఛేంజర్ సినిమాల్లో కియారా నటించింది.
Also Read : Uttarakhand: ఉత్తరాఖండ్‌లో దారుణం.. హిమపాతంలో చిక్కుకున్న 57 మంది కార్మికులు