Allu Arjun Raaka Poster: బర్త్ డే రోజు బట్టతలతో ఫ్యాన్స్ కు షాకిచ్చిన బన్నీ..! 'రాకా' పోస్టర్ లో ఇవి గమనించారా..?

అల్లు అర్జున్ - అట్లీ మూవీకి “రాకా” అనే టైటిల్ ప్రకటించారు. ఫస్ట్ లుక్‌లో బాల్డ్, సగం మనిషి - సగం మృగంలా కనిపించి ఆసక్తి పెంచారు. దీపికా పడుకోణె హీరోయిన్ గా నటిస్తోంది. సైన్స్ ఫిక్షన్, యాక్షన్ తో భారీ స్థాయిలో 7 భాషల్లో 2027లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

New Update
Allu Arjun Raaka Poster

Allu Arjun Raaka Poster

Allu Arjun Raaka Poster: అల్లు అర్జున్ పుట్టినరోజు(Allu Arjun Birthday) సందర్భంగా అభిమానులకు ఒక భారీ సర్ప్రైజ్ ఇచ్చారు. దర్శకుడు అట్లీతో కలిసి చేస్తున్న కొత్త సినిమా (AA22xA6) టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి “రాకా” అనే పేరు పెట్టారు. టైటిల్‌తో పాటు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ పోస్టర్‌లో అల్లు అర్జున్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. బట్టతల (బాల్డ్ లుక్)లో కనిపిస్తూ, ముఖం మీద ఒక జంతువు చేయి లాంటి చేతిని పెట్టుకున్నట్టు చూపించారు. ఈ లుక్ చూసిన వెంటనే అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఆయన పాత్ర ఏమిటి? ఇందులో ఏదైనా అడవి లేదా అతీంద్రియ (సూపర్‌నేచురల్) కథ ఉందా? అనే అనుమానాలు మొదలయ్యాయి.

“Prepare yourself for a vision beyond limits” అనే ట్యాగ్‌లైన్‌తో సినిమా చాలా గ్రాండ్‌గా ఉండబోతుందని స్పష్టం చేశారు. ఈ మూవీ కథ సాధారణంగా కాకుండా కొత్త ప్రపంచాలను చూపించేలా ఉంటుందని టీమ్ చెబుతోంది.

ఈ సినిమా భారీ స్థాయిలో రూపొందుతోంది. మొత్తం 7 భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో బెంగాళీ, అరబిక్ లాంటి భాషలు కూడా ఉన్నాయి. అంటే ఇది కేవలం ఇండియా మాత్రమే కాదు, అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ అవుతుంది.

ఇంకా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకోణె కూడా కీలక పాత్రలో నటిస్తోంది. అల్లు అర్జున్‌తో ఆమె జోడీ కావడం ఈ సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చింది. అలాగే ఈ సినిమాకు మ్యూజిక్ అందించేది యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్.

ఇప్పుడు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కాస్త గమనిస్తే కొన్ని ఆసక్తికర విషయాలు కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ నుదిటిపై ఒక వింత గుర్తు ఉంది. అది ఏదైనా తెగకు సంబంధించిన గుర్తు అయి ఉండొచ్చు అనేలా ఉంది. అందువల్ల ఈ కథలో గిరిజన నేపథ్యం కూడా ఉండొచ్చన్న ఊహాగానాలు మొదలయ్యాయి.

అలాగే ఆయన కళ్లలో కోపం, ప్రతీకారం స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీన్ని చూస్తే ఇది రివెంజ్ స్టోరీ అయి ఉండొచ్చని అనిపిస్తుంది. ముఖంపై జంతువు చర్మం, వెంట్రుకలు ఉండటం వల్ల అడవిలో పెరిగిన వేటగాడిలా ఆయన పాత్ర ఉండబోతుందని అర్థమవుతోంది. చేతి గోర్లు కూడా చాలా పొడవుగా, ప్రమాదకరంగా చూపించారు.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆయన జుట్టు, మీసాలు తెల్లగా కనిపిస్తున్నాయి. దీని వల్ల పాత్రకు వయస్సు ఎక్కువగా ఉండొచ్చని అనిపిస్తుంది. ఇక ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ కథ అని కూడా వార్తలు వస్తున్నాయి. ప్రపంచాన్ని కాపాడటానికి సైంటిస్టులు ఆయనను ఇలా మార్చారా? అనే సందేహాలు కూడా ప్రేక్షకుల్లో వస్తున్నాయి.

ఇక ముందుగా వచ్చిన వార్తల ప్రకారం అల్లు అర్జున్ ఈ సినిమాలో మూడు పాత్రలు చేస్తారని కూడా చెబుతున్నారు. అయితే ఇప్పుడే విడుదలైన ఈ లుక్ ఒక్క పాత్రకే సంబంధించినదై ఉండొచ్చు.

మొత్తానికి అట్లీ ఈ సినిమాతో ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా 2027 సమ్మర్‌లో విడుదల కావచ్చని సమాచారం.

Advertisment
తాజా కథనాలు