/rtv/media/media_files/2024/11/17/r1BmbrsRl3DEwYJ3YcbZ.jpg)
కోలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్ళికి రెడీ అయినట్లు తమిళ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈసారి అది నిజమేనని కీర్తి సురేష్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. డిసెంబర్ లో కీర్తి సురేశ్ పెళ్లి చేసుకోబోతుందని తెలుస్తోంది. కీర్తి సురేశ్‌ది ప్రేమ వివాహం కాకుండా.. పెద్దలు కుదిర్చిన సంబంధం. పెళ్లి కొడుకు కీర్తి సురేశ్‌కి ఫ్యామిలీకి బాగా తెలిసివాడేనని సమాచారం.
డిసెంబర్ లో పెళ్లి..
ఈ ఏడాది డిసెంబర్ రెండోవారంలో గోవాలో కీర్తి సురేశ్ పెళ్లి జరగబోతున్నట్లు కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. దీనిపై కీర్తి సురేష్ నుంచి కానీ.. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ ఎటువంటి అధికారిక సమాచారం లేనప్పటికి.. తమిళ మీడియా ఇప్పుడు దీన్నే హైలైట్ చేస్తోంది. మరి ఇందులో నిజం ఎంతుందో తెలియాలంటే దీనిపై పూర్తి స్పష్టత వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే.
Also Read : బీహార్ లో 'పుష్ప2' క్రేజ్.. రియల్ గన్స్ పేల్చి మరీ ఫ్యాన్స్ రచ్చ
HEART-BREAKING NEWS FOR FANS 💔
— Model Hub (@Model_hub_1111) November 17, 2024
As per some sources: Keerthy Suresh is all set to get married this December in Goa. It is said that the groom is related to her family. The formal announcement is anticipated shortly.#KeerthySuresh #Wedding pic.twitter.com/CF9ozxaCYd
గతంలోనూ చాలా సార్లు..
నిజానికి కీర్తి సురేష్ పెళ్లిపై రూమర్స్ రావడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో కూడా చాలా సార్లు ఈ రూమర్స్ వచ్చాయి. ఓసారి బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకోబోతుందని, ఇంకోసారైతే ఏకంగా తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌తో కీర్తి సురేశ్ ప్రేమలో పడినట్లు గతంలో వార్తలు వచ్చాయి.
Also Read : 'కంగువా' నిజంగానే బాలేదు.. భర్త సినిమాపై జ్యోతిక రివ్యూ
అయితే కీర్తి సురేశ్ పేరెంట్స్ వాటిని ఖండించారు. ఇక కీర్తి సురేష్ ప్రెజెంట్ వరుస సినిమా ఆఫర్స్ తో బిజీగా ఉంది. తెలుగు, తమిళ సినిమాలతో పాటూ ఈ ఏడాది బాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. వరుణ్ ధావన్ సరసన 'బేబీ జాన్' అనే సినిమాలో నటిస్తోంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.