Nandamuri Balakrishna: ఫ్యాన్స్‌కు బాలయ్య డబుల్ ట్రీట్.. గెట్ రెడీ!

జూన్ 10న నందమూరి అభిమానులకు డబుల్ ట్రీట్ దక్కనుంది. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న గోపీచంద్ మలినేని సినిమా నుంచి టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ విడుదలయ్యే ఛాన్స్ ఉండగా, కొరటాల శివ ప్రాజెక్ట్ నుంచి కూడా స్పెషల్ గ్లింప్స్ రానున్నట్లు టాక్ నడుస్తోంది.

New Update
Nandamuri Balakrishna

Nandamuri Balakrishna

Nandamuri Balakrishna: నందమూరి అభిమానులకు జూన్ 10న చాలా స్పెషల్ డే.. నందమూరి బాలకృష్ణ Nandamuri Balakrishna నటిస్తున్న రెండు భారీ సినిమాల నుంచి అదే రోజు ఆసక్తికరమైన అప్డేట్లు వచ్చే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.

దర్శకుడు గోపీచంద్ మలినేని Gopichand Malineni తో బాలకృష్ణ చేస్తున్న కొత్త సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్‌తో పాటు టైటిల్‌ను కూడా విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక మరోవైపు దర్శకుడు కొరటాల శివ Koratala Siva తో తెరకెక్కనున్న ప్రాజెక్ట్ నుంచి కూడా చిన్న స్పెషల్ గ్లింప్స్ వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ Anirudh Ravichander అందించే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ గ్లింప్స్‌కు మరింత హైలైట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.

ఒకే రోజు రెండు సినిమాల నుంచి అప్డేట్లు వస్తే, మాత్రం బాలయ్య అభిమానులకు డబుల్ ట్రీట్‌ అని చెప్పొచ్చు..

Advertisment
తాజా కథనాలు