కండోమ్ కంపెనీ పై కేసు వేసిన సుహాస్.! 'జనక అయితే గనక' ట్రైలర్ టాలీవుడ్ నటుడు సుహాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'జనక అయితే గనక'. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ మీరు కూడా చూసేయండి. By Archana 09 Oct 2024 in సినిమా Latest News In Telugu New Update Janaka Aithe Ganaka షేర్ చేయండి Janaka Aithe Ganaka : 'కలర్ ఫొటో', 'అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్వం, రైటర్ పద్మభూషణ్ వంటి సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు సుహాస్ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ ఫార్మ్ లో దూసుకెళ్తున్నాడు. ఇటీవలే 'గొర్రె పురాణం' అంటూ సరికొత్త కాన్సెప్ట్ తో అలరించిన సుహాస్.. మరో ఇంట్రెస్టింగ్ కామెడీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 'జనక అయితే గనక' సందీప్ బండ్ల దర్శకత్వంలో సుహాస్ నటించిన లేటెస్ట్ మూవీ 'జనక అయితే గనక'. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ మూవీ రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేశారు. జనక అయితే గనక ట్రైలర్ ట్రైలర్ చూస్తుంటే.. మూవీ అంతా ఒక మిడిల్ క్లాస్ కుటుంబం చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందినట్లు తెలుస్తోంది. ఇందులో హీరో (సుహాస్) ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన అబ్బాయి పాత్రను పోషించాడు. LKG, UKG లకే లక్షలు వసూలు చేస్తున్న ఈ కాలంలో.. పిల్లలు పుడితే వారిని ఎలా పెంచాలి, ఎలా చదివించాలి అనే భయంతో హీరో(సుహాస్) ఉంటాడు. ఇంతలో అతని భార్య ప్రెగ్నెంట్ అంటూ సుహాస్ కు షాకిస్తుంది. దీంతో సుహాస్ తాను వాడిన కండోమ్ వలనే ఇలా అయ్యిందని.. నాసిరకం కండోమ్‌లను సప్లయ్ చేస్తున్న కంపెనీపై కేసు పెడతాడు. ఇక ఈ కేసుతో సుహాస్ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది..? తాను కండోమ్ కంపెనీ పై పెట్టిన కేసు గెలిచాడా..? అనే సన్నివేశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. మరో వైపు ట్రైలర్ లో రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కామెడీ సీన్స్ నవ్వులు పూయించాయి. ఈ చిత్రంలో సంగీత్, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. Also Read: స్క్రీన్ పై నేను, ఆ హీరో బాగా కనిపిస్తాము..! రాశీ కామెంట్స్ వైరల్ #tollywood #janaka-aithe-ganaka #actor-suhas మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి