/rtv/media/media_files/2025/03/25/94mXGfSxrMa09zGZb2T2.jpg)
టాలీవుడ్ సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్ ఈ మధ్య వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా రాబిన్ హుడ్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఆసీస్ మాజీ క్రికెటర్ డెవిడ్ వార్నర్ ను అసభ్యంగా తిట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడం, రాజేంద్రప్రసాద్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో ఆయన క్షమాపణలు చెప్పారు.
సోషల్ మీడియాలో వీడియో సంచలనం
తాజాగా ఆయనకు సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. రాబిన్ హుడ్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు వచ్చినప్పుడు రాజేంద్రప్రసాద్ కారులో నుంచి దిగి మరో వ్యక్తితో మాట్లాడుతూ.. కారు డోర్‌ను కాలితో తన్నినట్లుగా వీడియోలో కనిపిస్తుంది. దీంతో మద్యం మత్తులో రాజేంద్ర ప్రసాద్ ఈవెంట్‌కు వచ్చారంటూ సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు అది క్యాజువల్ గా చేసిందేనని.. దాన్ని అంతలా రచ్చ చేయాల్సిన అవసరం లేదంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో అయితే ఫుల్ వైరల్ గా మారింది.
రాబిన్ హుడ్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు వచ్చినప్పుడు కారు డోర్‌ను కాలితో తన్నిన నటుడు రాజేంద్ర ప్రసాద్
— Telugu Scribe (@TeluguScribe) March 25, 2025
మద్యం మత్తులో రాజేంద్ర ప్రసాద్ ఈవెంట్‌కు వచ్చారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు https://t.co/CqsWyNY8KE pic.twitter.com/RHJDXZhFfX
ఇక రాబిన్ హుడ్ మూవీ మూవీ విషయానికి వస్తే.. వెంకీ కుడుములు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్లో నటించారు. ఇప్పటికే డేవిడ్ వార్నర్ లుక్ టీజర్ విడుదల చేయగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. హెలికాప్టర్ నుంచి దిగుతూ.. లాలీపాప్ తింటూ స్టైలిష్ ఎంట్రీ ఇచ్చారు. దీంతో సినిమాలో వార్నర్ పాత్ర ఎలా ఉండబోతుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటించగా.. రాజేంద్రప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ సంగీతం అందించారు. ఇదిలా ఉంటే ఈమూవీ ట్రైలర్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. నితిన్ యాక్షన్, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ కామెడీ సన్నివేశాలు అలరించాయి.
Also Read : Katrina Kaif: ఇవేం కోరికలు.. కత్రినా ప్రెగ్నెన్సీ పై నెటిజన్ల పోస్టులు!