Raja Saab OTT Trolls: పాపం 'రాజాసాబ్'.. ఓటిటిలోనూ ఎడాపెడా ఆడేసుకుంటున్నారుగా..!

రాజాసాబ్ థియేటర్లలో మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. భారీ బడ్జెట్ వల్ల నష్టాలు వచ్చాయి. OTTలో రిలీజ్ అయినప్పుడు భారీ వ్యూయింగ్‌తో సర్వర్లు క్రాష్ అయ్యాయి. కానీ డూప్ సీన్స్, కారణంగా సినిమా ట్రోలింగ్‌కు గురై ప్రభాస్, డైరెక్టర్ మారుతిపై విమర్శలు పెరిగాయి.

author-image
By Lok Prakash
New Update
Raja Saab OTT Trolls

Raja Saab OTT Trolls

Raja Saab OTT Trolls: పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్ థియేటర్లలో భారీ అంచనాలతో విడుదలైంది. మొదటి రోజే మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, పండగ అడ్వాంటేజ్‌తో వీకెండ్ వరకు కొంత జోరు చూపించింది. అయితే భారీ బడ్జెట్ కారణంగా రికవరీ టార్గెట్ చాలా ఎక్కువగా ఉండటంతో బాక్స్ ఆఫీస్ వద్ద నిలబడలేకపోయింది.

11 రోజుల పాటు రోజుకు కోటికి తగ్గకుండా షేర్ వచ్చినా కూడా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాకపోవడంతో, చివరకు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.

థియేటర్ల రన్ ముగిసిన వెంటనే సినిమా OTT రిలీజ్ కు సిద్ధమైంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తితో OTTలో సినిమా చూసేందుకు భారీగా ఎగబడ్డారు. ఈ కారణంగా జియో హాట్‌స్టార్ సర్వర్లు కూడా క్రాష్ అయ్యాయి. అయితే సినిమా డిజిటల్‌గా వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

రాజా సాబ్ OTTలో ఓ రేంజ్ రచ్చ… 

సినిమాపై ఓ రేంజ్‌లో ట్రోల్స్ మొదలయ్యాయి. ముఖ్యంగా ప్రభాస్ డూప్‌ను ఎక్కువగా వాడినట్లు కనిపించే సీన్స్, వేరే వ్యక్తి బాడీకి ప్రభాస్ ముఖం అతికించినట్లు అనిపించే షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇతర హీరోల ఫ్యాన్స్ స్క్రీన్‌షాట్లు, వీడియోలతో ఈ విషయాలను బాగా ట్రెండ్ చేశారు.

ఈ ట్రోల్స్‌ను ప్రభాస్ ఫ్యాన్స్ కూడా డిఫెండ్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అంత భారీ బడ్జెట్‌తో తీసిన సినిమాలో కనీస జాగ్రత్తలు తీసుకోలేదని డైరెక్టర్ మారుతిని నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ప్రభాస్‌ను ఇలా చూడలేక, కాపాడలేక ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు.

మొత్తానికి రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలకంటే కూడా ఎక్కువ డ్యామేజ్‌ను ప్రభాస్‌కు రాజా సాబ్ ఇచ్చిందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ఇదిలా ఉండగా, మేకర్స్ సినిమా OTT రిలీజ్‌ను ఫిబ్రవరి 6న జియో హాట్‌స్టార్‌లో ప్రకటించారు. అంతేకాదు, థియేటర్ వెర్షన్‌లో లేని సీన్స్ ఉన్నాయని చెబుతూ ఎక్స్‌టెండెడ్ వెర్షన్ కూడా రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. అయితే దీనిపై కూడా నెటిజన్లు సెటైర్లు వేశారు. “ఇది ఎక్స్‌ట్రా ట్రోల్ మెటీరియల్ కాదా?” అని కొందరు కామెంట్స్ చేయగా, “ఇది ఎవరు చూస్తున్నారు?” అని మరికొందరు ప్రశ్నించారు.

ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహించగా, ప్రభాస్‌తో పాటు సంజయ్ దత్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, జరినా వహాబ్ కీలక పాత్రల్లో నటించారు. సినిమా కథ విషయానికి వస్తే, అల్జీమర్స్‌తో బాధపడుతున్న నానమ్మతో కలిసి ఉండే రాజా సాబ్ తన తాతను వెతుక్కుంటూ హైదరాబాద్ రావడం, అక్కడ తాత జీవితం గురించి షాకింగ్ నిజాలు తెలుసుకోవడమే ప్రధాన కథ.

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా రికవరీ మార్క్‌ను కూడా అందుకోలేకపోయింది. సుమారు 400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా కేవలం 200 కోట్లకు పైగా మాత్రమే వసూలు చేసింది. దీంతో నిర్మాతలకు భారీ నష్టాలు తప్పలేదు.

OTT రిలీజ్ తర్వాత కూడా సినిమా పరిస్థితి మారలేదు. కథ, కథనం, విజువల్స్, ప్రభాస్ నటన అన్నింటిపైనా నెగెటివ్ కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా డైరెక్టర్ మారుతి ఈ స్థాయి స్టార్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడనే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.

మొత్తానికి రాజా సాబ్ థియేటర్లలోనే కాదు, OTTలో కూడా ట్రోల్స్‌తోనే హైలైట్ అవుతూ, ప్రభాస్ కెరీర్‌లో మరో పెద్ద నిరాశగా మిగిలిపోయింది.

Advertisment
తాజా కథనాలు