హర్షసాయి కేసులో బిగ్ ట్విస్ట్.. పరారీలో మరో యూట్యూబర్

యూట్యూబర్‌ హర్షసాయి వ్యవహారంలో యూట్యూబర్ ఇమ్రాన్ పేరు బయటికొచ్చింది. గతంలో యువసామ్రాట్ అనే వ్యక్తిపై కేసు పెట్టిన హర్షసాయి తన అడ్రస్ గా పోలీసులకు ఇమ్రాన్ అడ్రస్ ను ఇవ్వడం చర్చకు దారి తీసింది. దీంతో పోలీసులు వాళ్ళిద్దరి కోసం గాలిస్తున్నారు.

New Update
hrsi

యూట్యూబర్‌ హర్షసాయి కేసులో సంచలన విషయాలు బయటికొచ్చాయి. ఈ వ్యవహారంలో యూట్యూబర్ ఇమ్రాన్ పేరు బయటికొచ్చింది. ఇప్పటికే హర్షసాయి వ్యవహారాలకు యూట్యూబర్‌ ఇమ్రాన్‌ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. అయితే హర్ష సాయి పెద్ద మోసగాడని, ఆటను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఎంతమంది అమాయకుల చావుకు కారణం అయ్యాడని యువసామ్రాట్‌ అలియాస్‌ రవి అనే వ్యక్తి సోషల్ మీడియాలో హర్షసాయిపై తీవ్ర ఆరోపణలు చేశాడు. 

తప్పుడు అడ్రస్ ఇచ్చి..

దీనిపై రియాక్ట్ అయిన హర్షసాయి.. యువసామ్రాట్‌ తనపై తప్పుడు ఆరోపణలు చేసున్నాడని అతనిపై గతంలో హర్ష సాయి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు. ఆ సమయంలో హర్షసాయి పోలీసులకు యూట్యూబర్‌ ఇమ్రాన్‌ అడ్రస్ ను తన అడ్రస్ గా ఇచ్చాడు. దీంతో ఇప్పడు ఇదికాస్త తీవ్ర చర్చకు దారి తీసింది.

Also Read : టాలీవుడ్ లో మరో సెన్సేషనల్ కాంబో.. పండగ చేసుకుంటున్న మెగా ఫ్యాన్స్

ఇమ్రాన్‌ అడ్రస్‌తో హర్షసాయి కేసు పెట్టడం ఏంటి? హర్షసాయి, యూట్యూబర్‌ ఇమ్రాన్‌ మధ్య లింకేంటి? హర్షసాయి అరాచకాలకు ఇమ్రాన్‌ సపోర్ట్‌ ఉందా? అనే రీతిలో పోలీసులు ఎంక్వయిరీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే హర్షసాయి తప్పుడు అడ్రస్‌ ఇవ్వడంపై పోలీసులు సీరియస్‌ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హర్ష సాయి పరారీలో ఉన్న విషయం తెలిసిందే. అతన్ని పోలీసులు వెతుకుతున్నారు. అటు ఇమ్రాన్ సైతం ఇప్పుడు పరారిలో ఉన్నట్లు సమాచారం. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hansika: నటిపై గృహ హింస కేసు.. హైకోర్టును ఆశ్రయించిన హన్సిక!

గృహ హింస కేసులో భాగంగా ముంబై హైకోర్టును ఆశ్రయించింది నటి హన్సిక. హన్సిక సోదరుడి భార్య ముస్కాన్.. తనతోపాటు తన తల్లిపై పెట్టిన కేసు కొట్టివేయాలంటూ క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ కేసు తదుపరి విచారణను కోర్టు జూలై 3కు వాయిదా వేసింది.

New Update
hansika

hansika Photograph: (hansika)

Hansika: గృహ హింస కేసులో భాగంగా ముంబై హైకోర్టును ఆశ్రయించింది నటి హన్సిక. హన్సిక సోదరుడి భార్య ముస్కాన్.. తనతోపాటు తన తల్లిపై పెట్టిన కేసు కొట్టివేయాలంటూ క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. 2024 డిసెంబర్ 18న అంబోలి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. 

హన్సిక ఫ్యామిలీపై కేసు..

ఈ మేరకు హన్సిక సోదరుడు ప్రశాంత్‌ మోత్వానీ భార్య ముస్కాన్ నాన్సీ తనను వేధిస్తున్నారంటూ హన్సిక ఫ్యామిలీపై కేసు పెట్టింది. హన్సికా, ఆమె తల్లి మోనా మోత్వానీ తన భర్తతో వివాహం, రిలేషన్‌షిప్‌ అంశంలో జోక్యం చేసుకుంటున్నారని, తమ మధ్య గొడవలు పుట్టించారని ఆమె ఆరోపించింది. ప్రశాంత్ గృహ హింసకు కూడా పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొంది. వారివల్లే తనకు పక్షవాతం వచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొంది. హన్సిక, అత్త ఆస్తి లావాదేవీల్లో మోసం చేస్తున్నట్లు ఆరోపించింది. 

ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేయగా సెక్షన్ 498A కేసును రద్దు చేయాలంటూ ముంబై హైకోర్టును ఆశ్రయించింది హన్సిక. ఈ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన జస్టిస్ సరంగ్ కోట్వాల్, జస్టిస్ మోడక్‌లతో కూడిన ధ‌ర్మాస‌నం ముస్కాన్ నాన్సీకి నోటిసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 3కు వాయిదా వేసింది.

 

https://www.youtube.com/watch?v=y8IgX9yxRMY

domestic-voilence | mumbai | high-court | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment