/rtv/media/media_files/2025/03/20/woq7hVuf1SK7CnIJ9dqN.jpg)
Grok AI On Chiranjeevi Vishwambhara
Grok AI: ప్రస్తుతం ఇండియాలో ఫుల్ వైరల్ అవుతున్న పదం "గ్రోక్ ఏఐ". ఇది ఎలాన్ మస్క్ అభివృద్ధి చేసిన ఒక కొత్త కృత్రిమ మేధస్సు(Artificial Intelligence) ఆధారిత టూల్ గా ప్రత్యేకంగా గుర్తింపు పొందింది. ఈ కొత్త "గ్రోక్ ఏఐ"ని ఎక్స్ వేదికగా మస్క్ ఇంటర్నెట్ యూజర్లకు పరిచయం చేసారు. ఏఐ చాట్ బాట్ అనగానే మనకి బాగా గుర్తొచ్చేవి "చాట్‌జీపిటీ"(ChatGPT), "డీప్‌సీక్" వంటి టూల్స్. అయితే తాజాగా వాటితో పోటీగా ఎలాన్ మస్క్ తెచ్చిన ఈ "గ్రోక్ ఏఐ" బాగా వైరల్ అవుతోంది.
Also Read: దెయ్యాలతో చెడుగుడు ఆడేస్తాం.. ఎనీ డౌట్స్..?
"గ్రోక్" స్పెషాలిటీ ఏంటంటే, చాట్‌జీపిటీకి భిన్నంగా, సున్నితమైన భాషను మాత్రమే వాడకుండా, యూజర్ కి అనుకూలమైన భాషలో సమాధానాలను అందిస్తుంది. దీంతో ఇప్పుడు నెటిజన్లు ఫుల్ గా ఆడేసుకుంటున్నారు. మన తెలుగు వాళ్లయితే ఏకంగా "గ్రోక్"ని వాడుకొని ఫ్యాన్ వార్ లే చేస్తున్నారు. రీసెంట్ గా "బీజేపీ" చేస్తున్న ఫేక్ ప్రోపాగండా వార్తలను కూడా "గ్రోక్" ఒక మినిట్‌లో ఎక్స్పోజ్ చేసింది.
Also Read: జోరు పెంచిన 'ది రాజాసాబ్'.. టీజర్ లోడింగ్..!
విశ్వంభర టీజర్ పై భారీ ట్రోలింగ్: గ్రోక్ ఏఐ
అయితే, ఇప్పుడు దేనికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది. ఒక తెలుగు నెటిజన్, ఎక్స్‌లో "అత్యధికంగా ట్రోల్ అయిన టాలీవుడ్ మూవీ ఏంటి?" అని అడగగా, మెగాస్టార్ చిరంజీవి "విశ్వంభర" సినిమా అని "గ్రోక్" సూటిగా సమాధానమిచ్చింది(Grok AI On Chiranjeevi Vishwambhara). ఆ మధ్య రిలీజైనా విశ్వంభర టీజర్ పై నిజంగానే భారీ ట్రోలింగ్ జరిగింది. క్వాలిటీ లేని VFX, కాపీ చేసిన సీన్లు అంటూ టీజర్ ను విపరీతంగా ట్రోల్ చేసారు నెటిజన్లు, ట్రోలింగ్ దెబ్బకు నిర్మాతలు ఏకంగా సినిమానే వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది.
Also Read: నాని 'గే' నా..? టాలెంటెడ్ హీరోని ట్రాన్స్ జెండర్ చేసారు కదరా..!
అయితే "విశ్వంభర" సినిమా, ఎక్స్‌లో అత్యధికంగా ట్రోలింగ్‌కు గురైన చిత్రంగా "గ్రోక్" పేర్కొనడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఫ్యాన్ వార్లకు దారి తీస్తోంది. ఆ తర్వాత వరుణ్ తేజ్ "ఆపరేషన్ వాలెంటైన్"(Operation Valentine), విజయ్ దేవరకొండ "ఫ్యామిలీ స్టార్" (Family Star), "లైగర్"(Liger), పూరీ జగన్నాథ్ "డబుల్ ఇస్మార్ట్"(Double Ismart), రవితేజ - హారీశ్ శంకర్ ల "మిస్టర్ బచ్చన్"(Mr Bachchan), వంటి చిత్రాలను కూడా "గ్రోక్ ఏఐ" తన ట్రోలింగ్ లిస్ట్ లో పేర్కొంది. దీంతో ఇప్పుడు ఈ వీడియో వైరల్ కావడమే కాకుండా, "గ్రోక్" సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
Also Read: రా కి రా.. సార్ కి సార్..! గ్రోక్ ఏఐ దెబ్బ అదుర్స్ కదూ!
Most Trolled Telugu Movies on Twitter Till Today @grok ?
— Milagro Movies (@MilagroMovies) March 17, 2025