యాక్షన్ హీరో గోపీచంద్ - శ్రీను వైట్ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'విశ్వం'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన ఫస్ట్ స్ట్రైక్, వరల్డ్ ఆఫ్ విశ్వం మేకింగ్ వీడియో సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేయగా.. రీసెంట్ గా వచ్చిన టీజర్.. శ్రీను వైట్ల మార్క్ కామెడీ , గోపీచంద్ యాక్షన్ తో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది.
ఇక ఇటీవలే ఈ మూవీకి సంబంధించి మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తూ 'మొరాకన్ మగువ' అనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. క్యాచీ లిరిక్స్, బ్యూటిఫుల్ విజువల్స్ తో ఈ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను ఇంప్రెస్ చేసింది. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ వదిలారు. 'మొండి తల్లి పిల్ల నువ్వు' అంటూ సాగే ఈ పాట కంప్లీట్ ఎమోషనల్ మోడ్ లో సాగింది. పాట మొత్తం తల్లీ, కూతుళ్ళ మధ్య సెంటిమెంట్‌తో సాగింది.
A beautiful melody that reflects the timeless bond of a mother and child💗#MondiThalliPillaNuvvu from #Viswam is out now!
— Gopichand (@YoursGopichand) September 24, 2024
- https://t.co/MrJQdoTQcd pic.twitter.com/b4mtgq8Cno
యాక్షన్ తో పాటూ ఎమోషన్ కూడా..
శ్రీహర్ష ఎమని రాసిన ఈ పాటను సాహితి చాగంటి పాడింది. చేతన్ భరద్వాజ్ కంపోజ్ చేశారు. ఇప్పటి వరకు సినిమా నుంచి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ ను బట్టి సినిమా యాక్షన్, కామెడీతో ఉండబోతుందని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. కానీ లేటెస్ట్ సాంగ్ తో ఎమోషన్ కూడా ఉంటుందని చెప్పేశారు.
Also Read : పవన్ కు సూర్య క్షమాపణలు.. నెట్టింట రచ్చ, మరో ట్వీట్ వైరల్
ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మూవీలో గోపీచంద్ సరసన కావ్యథాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది. సీనియర్ నటుడు నరేశ్, ప్రగతి, వెన్నెల కిశోర్, షకలక శంకర్, అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గోపీమోహన్ స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది.