Gopichand: ప్రభాస్ బాటలోనే గోపీచంద్.. యుద్ధ వీరుడుగా కొత్త సినిమా పవర్‌ఫుల్ టైటిల్ ఫిక్స్!

గోపీచంద్ నటిస్తున్న 33వ సినిమాకు "భరత వర్ష సాగ ఆఫ్ శూల" అనే టైటిల్ పెట్టారు. 7వ శతాబ్దం కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం పవర్‌ఫుల్ గ్లింప్స్ విడుదల కాగా, షూటింగ్ కొనసాగుతోంది.

New Update
Gopichand

Gopichand

Gopichand: గోపీచంద్ హీరోగా నటిస్తున్న 33వ సినిమా ఎట్టకేలకు టైటిల్‌ను ప్రకటించారు. ఈ చిత్రానికి "భరత వర్ష సాగా ఆఫ్ శూల" (Bharatavarsha Saga of Shoola)అనే పేరు పెట్టారు. ఈ సినిమా 7వ శతాబ్దం కాలంలో జరిగిన ఓ చరిత్ర కథ ఆధారంగా రూపొందుతోంది. సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

టైటిల్ ప్రకటిస్తూ మేకర్స్ ఒక పవర్‌ఫుల్ గ్లింప్స్ విడుదల చేశారు. అందులో గోపీచంద్ చాలా పవర్ఫుల్ లుక్‌లో కనిపించారు. యాక్షన్ సన్నివేశాలు, భారీ విజువల్స్ చూస్తే సినిమా పెద్ద స్థాయిలో తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. త్వరలో రిలీజ్ తేదీని ప్రకటించే అవకాశం ఉంది.

ఈ సినిమాలో రీతు వర్మ తో పాటు వినోద్ కుమార్, గవి చహల్, తనికెళ్ల భరణి, రాకేష్ వర్రే, భరత్ రెడ్డి, చత్రపతి శేఖర్, రవి వర్మ, కిషోర్, కార్తికేయ, మధుమణి, బేబీ తేజల్ వంటి పలువురు నటిస్తున్నారు.

ఈ చిత్రాన్ని శ్రీనివాసా చిత్తూరి నిర్మిస్తున్నారు. పావన్ కుమార్ ప్రెజెంట్ చేస్తున్నారు. టెక్నికల్ టీమ్‌లో సినిమాటోగ్రఫీని మణికందన్ ఎస్ చూస్తున్నారు. ప్రొడక్షన్ డిజైన్‌ను చిన్న నిర్వహిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలను ప్రుధ్వీ మాస్టర్ రూపొందిస్తున్నారు. సంగీతాన్ని అనుదీప్ దేవ్ అందిస్తున్నారు.

మొత్తంగా చూస్తే, గోపీచంద్ ఈ సినిమాతో మరో భారీ హిట్ అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు