Movies in May: మేడే బాక్సఫీస్ విన్నర్ ఎవరు..?

తెలుగు బాక్సాఫీస్‌ వద్ద మే నెలలో పలు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. గాయపడ్ద సింహం, జెట్‌లీ, కారా, పాట్రియట్, ఏక్ దిన్, రాజా శివాజీ వంటి చిత్రాలు పోటీలో ఉన్నాయి. వీటిలో ఏ సినిమా బాక్సాఫీస్‌ను ఆకట్టుకుంటుందో చూడాలి.

New Update
Movies in May

Movies in May

Movies in May: తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్‌కు పెద్ద హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నెలలో పెద్ద విజయాలు కనిపించలేదు. “డాకాయిట్” కొన్ని ప్రాంతాల్లో బాగానే ఆడినా, అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ రాలేదు. అందుకే అందరి దృష్టి ఇప్పుడు మే నెలపై ఉంది. మేలో తరుణ్ భాస్కర్ నటిస్తున్న “గాయపడ్ద సింహం”(Gaayapadda Simham) విడుదలకు సిద్ధంగా ఉంది. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఇప్పటికే మంచి ప్రమోషన్ జరుగుతోంది. ఇంకా సత్య నటిస్తున్న “జెట్‌లీ” (JETLEE)సినిమాపై కూడా మంచి ఆశలు ఉన్నాయి. రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇండస్ట్రీలో మంచి హైప్ తెచ్చుకుంటోంది.

ఇవే కాకుండా కొన్ని డబ్బింగ్ సినిమాలు కూడా రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. ధనుష్ నటించిన “కారా” సినిమాపై కూడా ప్రేక్షకులలో మంచి ఆసక్తి ఉంది. కథ బాగుంటే ఈ సినిమా హిట్ అయ్యే అవకాశముంది. మమ్ముట్టి, మోహన్‌లాల్ కలిసి నటించిన “పాట్రియట్” కూడా మేలో రావడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాకు సెన్సార్ సమస్యలు ఉండటంతో విడుదలపై కొంత అనుమానం ఉంది.


సాయి పల్లవి నటించిన తొలి సినిమా “ఏక్ దిన్” కూడా మేలోనే విడుదల అవుతుంది. ఈ సినిమాకు పెద్దగా ప్రచారం లేకపోయినా, సాయి పల్లవి పేరు వల్ల ప్రేక్షకుల దృష్టి పడే అవకాశం ఉంది. ఇక రితేష్ దేశ్ముఖ్, జెనీలియా కలిసి నటించిన “రాజా శివాజీ” కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. శివాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమా తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ పొందే అవకాశం ఉంది. ఈ వేసవిలో మంచి సినిమాలు రావాలని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. కానీ ఈసారి పెద్ద సినిమాలు లేకపోవడం కొంత నిరాశ కలిగిస్తోంది. మరి మే నెలలో బాక్సాఫీస్‌ను ఏ సినిమా ఏలుతుందో చూడాలి.

Advertisment
తాజా కథనాలు