బిగ్‌బాస్ చరిత్రలో మొదటిసారి రెడ్ కార్డ్.. సీరియస్ అయిన నాగార్జున

బిగ్‌బాస్ సీజన్-8 ప్రోమోలో అభయ్‌ నవీన్‌పై నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. బిగ్‌బాస్‌పై తీవ్ర విమర్శలు చేయడంతో అభయ్‌పై సీరియస్ అవుతూ బలవంతంగా రెడ్ కార్డు ఇచ్చారు. అభయ్ గెట్ అవుట్ ఆఫ్ ది హౌస్ అంటూ.. నాగార్జున గేట్లు ఒపెన్ చేయించారు.

New Update

బిగ్‌బాస్ సీజన్-8 రసవత్తరంగా సాగుతోంది. వీకెండ్‌లో వచ్చే ప్రోమో కోసం బిగ్‌బాస్ ప్రేమికులు ఎంతగానో వేచిచూస్తారు. తాజాగా వీకెండ్ ప్రోమో రాగా.. అందులో నాగార్జున అభయ్ నవీన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ ఫేస్‌.. నీ వాయిస్.. అన్ని లఫంగీ మాటలు అన్నావు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదని నాగార్జున సీరియస్ అయ్యాడు. ఇది బిగ్‌బాస్ హౌస్.. ఇక్కడ బిగ్‌బాస్ రూల్స్ ఉంటాయని, హౌస్‌లో ఉన్న అందరూ బిగ్‌బాస్ చెప్పినట్లు వినాలన్నారు. అభయ్ చేతులు జోడించి క్షమించమని అడిగిన కూడా నాగార్జున కరగలేదు. బిగ్‌బాస్‌ను గౌరవించకుండా ఇలా విమర్శిస్తే.. నేను కూడా క్షమించను. బలవంతంగా నీకు రెడ్ కార్డు ఇస్తున్నన్నారు. బిగ్‌బాస్ డోర్లు ఓపెన్ చేయండి.. అభయ్ గెట్ అవుట్‌ ఆఫ్‌ ది హౌస్ అని నాగార్జున కోపంతో చెప్పారు. మరి నాగార్జున అభయ్‌ను క్షమాపణను అంగీకరించి సేవ్ చేశాడా? లేదా? అనేది తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ చూడాల్సిందే. 

బిగ్‌బాస్ కాదు.. బయాస్డ్ బాస్

హౌస్‌మేట్‌లో ఒకరైన అభయ్ గతవారం నుంచి బిగ్‌బాస్‌పై విమర్శలు చేస్తున్నాడు. టాస్క్‌ల విషయంలో సరిగ్గా ప్రవర్తించలేదని అభయ్ బిగ్‌బాస్ మీద మండిపడ్డాడు. బిగ్‌బాస్ ఏం చేస్తున్నాడో ఆయనే తెలియదు. ఇంట్లో పెళ్లాం కొట్టిన ప్రతిసారి టాస్క్ మారుస్తున్నాడు. అసలు నువ్వు బిగ్‌బాస్ కాదు.. బయాస్డ్ బాస్ అంటూ తీవ్ర విమర్శలు చేశాడు. ఇలా విమర్శలు చేయడంతో అర్థరాత్రి పూట అభయ్‌తో పాటు హౌస్‌మేట్స్‌పై కూడా బిగ్‌బాస్ వార్నింగ్ ఇచ్చారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు