Director Sundar : అసెంబ్లీ ఎన్నికల్లో ఖుష్బూ భర్త పోటీ.. ఎక్కడి నుంచి అంటే?

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో తమిళనాడు రాజకీయాలు మరింత వేడెక్కాయి. ప్రముఖ సినీ దర్శకుడు, నటుడు సుందర్ సి ఈసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.

New Update
sundar

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో తమిళనాడు రాజకీయాలు మరింత వేడెక్కాయి. ప్రముఖ సినీ దర్శకుడు, నటుడు సుందర్ సి ఈసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈయన మదురై సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు. పుతియ నీది కచ్చి (NJP) పార్టీ తరపున ఆయన అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఏసీ షణ్ముగం అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన్ని చిదంబరం పిళ్లై కుమారుడు సుందర్ సి అని పరిచయం చేయడం విశేషం.

సుందర్ కు  గట్టి పోటీ

అయితే ఈ నియోజకవర్గంలో సుందర్ కు  గట్టి పోటీ ఎదురుకానుంది. ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, డీఎంకే కీలక నేత పళనివేల్ త్యాగరాజన్ తో ఆయన తలపడనున్నారు. డీఎంకే మళ్ళీ పీటీఆర్‌నే అక్కడ అభ్యర్థిగా నిలబెట్టే అవకాశం ఉంది. తమిళనాడులో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే (NDA) కూటమిలో భాగంగా పుతియ నీది కచ్చికి ఒక సీటు కేటాయించారు. ఆ ఒక్క సీటునే మదురై సెంట్రల్ రూపంలో సుందర్ సికి ఇచ్చారు.  

కాగా సుందర్ సి భార్య, ప్రముఖ నటి ఖుష్బూ ఇప్పటికే బీజేపీలో కీలక నేతగా ఉన్నారు. ఆమె గత 2021 ఎన్నికల్లో చెన్నైలోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు భార్య బాటలోనే సుందర్ సి కూడా రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

గత నెలలో మదురైలో జరిగిన ఒక కార్యక్రమంలో సుందర్ సి పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు వి.ఓ. చిదంబరం పిళ్లై 140 అడుగుల విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. తన తండ్రికి చిదంబరం అనే పేరు ఆ మహానుభావుడి మీద గౌరవంతోనే తన తాతగారు పెట్టారని గుర్తుచేసుకున్నారు. అప్పటి నుంచే ఆయన మదురై నుంచి పోటీ చేస్తారనే ప్రచారం మొదలైంది.

Advertisment
తాజా కథనాలు