/rtv/media/media_files/2026/04/29/faria-abdullah-2026-04-29-09-55-32.jpg)
Faria Abdullah
Faria Abdullah: నటి ఫరియా అబ్దుల్లా Faria Abdullah ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో చేసిన ఒక పెద్ద తప్పు గురించి ఓపెన్‌గా మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ, దర్శకుడు ప్రశాంత్ వర్మ Prasanth Varma తెరకెక్కించిన సూపర్ హిట్ సినిమా హను మాన్ Hanuman Movieలో నటించే అవకాశం తనకు వచ్చిందని, కానీ తాను ఆ అవకాశాన్ని రిజెక్ట్ చేశానని చెప్పారు.
ఫరియా చెప్పిన ప్రకారం, తన తొలి హిట్ సినిమా ‘జాతి రత్నాలు’ తర్వాత వచ్చిన క్రేజ్ కారణంగా ప్రతి కథను ఎలా అర్థం చేసుకోవాలో గందరగోళంలో పడిపోయానని తెలిపారు. ఆ సమయంలో ‘హనుమాన్’ స్క్రిప్ట్‌ను సరైన విధంగా అంచనా వేయలేకపోయానని, అందుకే ఆ సినిమాను చేయలేకపోయానని చెప్పారు.
Also Read: సంచలనానికి 9 ఏళ్ల! ‘బాహుబలి 2’ సృష్టించిన చరిత్ర ఇదే!!
Faria Abdullah reveals her biggest career regret: turning down HanuMan! 😮 Catch her candid reflections and latest buzz on Gaayapadda Simham. #FariaAbdullah#HanuMan#GaayapaddaSimhampic.twitter.com/kekC2u4qg9
— Dumtika (@DumtikaMedia) April 29, 2026
నవ్వుతూ మాట్లాడుతూ, “అప్పుడు నాకు బ్రెయిన్ లేదు, అందుకే ఆ అవకాశం మిస్ అయ్యింది” అని అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి.
Also Read: "డార్లింగ్ 4K" రీ-రిలీజ్ విధ్వంసం! ఆ రికార్డులన్నీ లేపేసిన ప్రభాస్!
ఆ తర్వాత ఈ సినిమాలో హీరోగా నటించిన తేజ సజ్జ Teja Sajjaతో పాటు దర్శకుడు ప్రశాంత్ వర్మను కలిసినప్పుడు కూడా ఆ మిస్ అయిన అవకాశం తనకు గుర్తొస్తుందని ఫరియా తెలిపారు.
‘హనుమాన్’ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించగా, ఆ పాత్రను చివరికి అమృత అయ్యర్ Amritha Aiyer చేశారు. ఆమె కెరీర్‌కు ఈ సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది.
Also Read: ట్రిపుల్ రోల్ లో ప్రభాస్! కల్కి 2 క్రేజీ అప్‌డేట్
ఇక ఫరియా ఇటీవల నటించిన సినిమాలు పెద్దగా విజయాన్ని సాధించలేదు. ప్రస్తుతం ఆమె నటించిన కొత్త సినిమా ‘గాయపడ్డ సింహం’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తన కెరీర్‌లో మలుపు తిప్పుతుందా లేదా అనేది చూడాలి.
Follow Us