/rtv/media/media_files/2026/05/21/ntr-dragon-2026-05-21-07-37-26.jpg)
NTR Dragon
NTR Dragon: 'డ్రాగన్' సినిమా గురించి దర్శకుడు ప్రశాంత్ నీల్ చేసిన తాజా వ్యాఖ్యలు అభిమానుల్లో భారీ ఆసక్తిని రేపాయి. ఆయన చెప్పిన వివరాల ప్రకారం, ఈ సినిమాలో Jr NTR పాత్ర ఇప్పటివరకు ఆయన రాసిన పాత్రలన్నింటిలోకెల్లా అత్యంత డార్క్‌గా ఉండనుందట.
ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ, “ఈ పాత్ర చాలా డార్క్. నేను ఇప్పటివరకు రాసిన వాటిలో ఇది అత్యంత నెగిటివ్ పాత్ర అని అన్నారు. ఈ క్యారెక్టర్‌ను పూర్తిగా తీర్చిదిద్దడానికి నాకు మూడు సంవత్సరాలు పట్టింది” అని వెల్లడించారు. ఈ మాటలతోనే పాత్ర ఎంత బలంగా ఉంటుందో అర్థమవుతోంది.
ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పేరు “ల్యూజర్” (LUGER) అని తెలుస్తోంది. ఇది సాధారణ హీరో పాత్రలా ఉండదని, పూర్తిగా నెగటివ్ షేడ్‌లో ఉంటుందని టాక్ వినిపిస్తోంది.
Jr NTR ఇంతకు ముందు కూడా కొన్ని గ్రే షేడ్ పాత్రలు చేశారు. కానీ పూర్తిగా డార్క్ క్యారెక్టర్ చేయడం ఆయన కెరీర్‌లో కొత్త అడుగు అని చెప్పాలి. అభిమానుల్లో ఇది ఒకవైపు షాక్ కలిగిస్తున్నా, మరోవైపు భారీ ఆసక్తిని కూడా పెంచుతోంది.
Dragon సినిమా రెండు భాగాలుగా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. ఈ ప్రాజెక్ట్‌ను Mythri Movie Makers, NTR Arts నిర్మిస్తున్నాయి.
ఇప్పటికే ఈ సినిమాకు విడుదలకు ముందే విదేశీ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్టు సమాచారం. సినిమా విడుదల 2027 జూన్‌లో ప్లాన్ చేస్తున్నారు.
మొత్తానికి, పూర్తిగా నెగటివ్ పాత్రలో Jr NTR ఎలా కనిపించబోతున్నారో తెలుసుకోవాలంటే అభిమానులు మరికొంత కాలం వేచి చూడాల్సిందే.
Follow Us