పవన్ కు ఎంతమంది కుమార్తెలో తెలుసా? పవన్ కల్యాణ్ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి తిరుమలకు రావడం చర్చనీయాంశంగా మారింది. చిన్న కుమార్తె మొదటి సారి మీడియా కంటపడటంతో అసలు ఆయనకు ఎంతమంది కూతుళ్లు ఉన్నారని నెట్టింట డిస్కషన్ జరుగుతోంది. అందుకు సంబంధించి పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ లోకి వెళ్ళండి. By Anil Kumar 02 Oct 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యిని వినియోగించారనే ఆరోపణలు రావడంతో అపచారం జరిగిందని పవన్ ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టిన సంగతి తెలిసిందే. గత నెల 22న ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టిన పవన్ 11 రోజుల దీక్ష తరువాత బుధవారం ఉదయం తిరుమలలో దీక్షను విరమించారు. ఈ మేరకు కాళీ నడకన తిరుమల కొండపైకి పవన్ కల్యాణ్ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి చేరుకున్నారు. ఈ సందర్భంగా పవన్ చిన్న కుమార్తె పలీనా అంజని కొణిదెల తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ సమర్పించారు. టీటీడీ ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై పలీనాతో పాటు పవన్ కూడా సంతకాలు చేశారు. పలీనా అంజని మైనర్ కావడంతో తండ్రిగా పవన్ డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో ఆద్యతో పాటూ చిన్న కూతురు పలీనా అంజని మొదటి సారి మీడియాకు కనిపించడంతో ఇప్పుడు ఈ అమ్మాయి గురించే అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు. పవన్ కు ఆధ్యాతో పాటూ ఇంకో కూతురు కూడా ఉందా? అసలు ఆయనకు మొత్తం ఎంతమంది కూతుళ్లు?.. ఇలా సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. 1997 లోనే పెళ్లి.. పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలోకి రాకముందే పెద్దల నిర్ణయం మేరకు.. నందిని రెడ్డి అనే అమ్మాయిని 1997 లో వివాహం చేసుకున్నారు. పెళ్లి అయిన మొదట్లో ఈ జంట బాగానే ఉన్నా.. ఆ తర్వాత కొద్ది రోజులకు చిన్న చిన్న గొడవలు వస్తూ ఉండేవి. ఆ గొడవలు కాస్త పెద్దవి కావడంతో.. 2007లో ఇద్దరు విడిపోయారు. అనంతరం ప్రముఖ హీరోయిన్, మోడల్ రేణు దేశాయ్ తో ప్రేమలో పడ్డారు పవన్ కళ్యాణ్. Also Read : ఒక్కేసి పువ్వేసి నుంచి నేటి నగాదారిలో వరకు.. దుమ్ములేపిన బతుకమ్మ సాంగ్స్ ఇవే! 'బద్రి' సినిమా షూటింగ్ టైం లోనే వీరిమధ్య ప్రేమ చిగురించింది. దాంతో కొన్నాళ్లు ఆమెతో సహజీవనం చేసి, కొడుకు అకీరా నందన్.. జన్మించిన తర్వాత కొడుకు సమక్షంలో 2009 లో వివాహం చేసుకున్నారు. కొన్నేళ్ళకు విడాకులు తీసుకున్నారు. అప్పట్లో వీరి విడాకులు పెద్ద సెన్సేషన్ ను క్రియేట్ చేశాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఎందుకు డివోర్స్ తీసుకున్నారో ఎవ్వరికీ అంతుపట్టలేదు. అయితే అప్పట్లో పవన్ క్యారెక్టర్ నచ్చక రేణు దేశాయ్ వదిలేసింది అనే రూమర్స్ వచ్చాయి. అలా ఇద్దరు భార్యలను దూరం చేసుకున్న పవన్ కళ్యాణ్ తనలాగే ఆలోచించే అన్నా లెజినోవాను మూడో వివాహం చేసుకున్నారు. మొదట ఈమె ఇంగ్లీష్ సినిమాలలో నటించేది. ఆ తర్వాత పవన్ నటించిన 'తీన్ మార్' సినిమాలో నటించింది. ఈ సినిమా నుంచే పవన్, అన్నాల మధ్య ప్రేమ మొదలైంది. ఆ తర్వాత రేణు దేశాయ్ కు విడాకులు ఇచ్చిన తర్వాత 2013లో అన్నా లెజ్నోవాను పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు 2017లో కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ జన్మించారు. అన్నా లెజ్నెవాకు అప్పటికే వివాహాం జరిగింది. మొదటి భర్తతో ఆడపిల్లకు జన్మనిచ్చింది. అనంతరం మొదటి భర్తతో విడాకుల తర్వాత అన్నాలెజ్నోవాకు పవన్ కళ్యాణ్ తో రెండో పెళ్లి జరిగింది. ఆ అమ్మాయినే పవన్ ఇప్పుడు తన సొంత కూతురిలా చూసుకుంటున్నారు. ఆమె పేరు పలీనా అంజని. తాజాగా తిరుమలలో ఆద్యతో కనిపించింది కూడా ఈమెనే. అంటే పవన్ కళ్యాణ్ కు ఉన్నది ఒకటే కూతురు ఆధ్యా.. కానీ అన్నాలెజ్నోవా కూతుర్ని కూడా ఆయన తన సొంత కూతురిలా చూసుకుంటుండటం విశేషం. #pawan-kalyan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి