OG 2 Update: హంగ్రీ చీతా ఆగయా.. ఇక వేట మొదలే!

డైరెక్టర్ సుజీత్ ప్రస్తుతం OG 2 స్క్రిప్ట్ పనులు మొదలుపెట్టినట్టు సమాచారం. ఈ సారి పవన్ కళ్యాణ్ పాత్రను మరింత పవర్‌ఫుల్‌గా చూపించేందుకు కొత్త పాత్రలు కూడా జోడిస్తున్నారట. బ్లడీ రోమియో ఆలస్యం కావడంతో సుజీత్ ఇప్పుడు OG 2పై పూర్తి దృష్టి పెట్టాడు.

New Update
OG 2 Update

OG 2 Update

OG 2 Update: డైరెక్టర్ సుజీత్ ఇప్పుడు మళ్లీ OG సీక్వెల్‌పై ఫోకస్ పెట్టినట్టు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన OG భారీ విజయాన్ని అందుకున్న తర్వాత నుంచే OG 2 గురించి అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఇప్పుడు ఆ సీక్వెల్ పనులు మొదలయ్యాయని సమాచారం.

OG సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. స్టైలిష్ యాక్షన్, పవర్‌ఫుల్ పాత్ర, సుజీత్ తీసిన విధానం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పాత్రను చూపించిన తీరు అభిమానులకు చాలా నచ్చింది.

OG తర్వాత సుజీత్ హీరో నానితో బ్లడీ రోమియో సినిమా చేయాలని ప్లాన్ చేశాడు. గత ఏడాదే షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉన్నా, డేట్స్ సమస్యలు, ప్రొడక్షన్ కారణాలతో సినిమా ఆలస్యం అయిందని తెలుస్తోంది. అలాగే నాని చేస్తున్న మరో సినిమా The Paradise కారణంగా కూడా డిలే జరిగిందని టాక్ వినిపిస్తోంది.

ఈ గ్యాప్‌ను ఉపయోగించుకుంటూ సుజీత్ ఇప్పుడు OG 2 కథపై పని చేస్తున్నాడట. ఈ సారి కథను మరింత పెద్ద స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మొదటి భాగంతో పోలిస్తే సీక్వెల్‌లో యాక్షన్, ఎమోషన్ ఇంకా ఎక్కువగా ఉండబోతున్నాయని అంటున్నారు.

అలాగే OG 2లో కొన్ని కొత్త పాత్రలను కూడా తీసుకురాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పాత్రను ఇంకా పవర్‌ఫుల్‌గా చూపించడానికి సుజీత్ ప్రత్యేకంగా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడని తెలుస్తోంది.

OG సినిమా విజయోత్సవ వేడుకల్లోనే పవన్ కళ్యాణ్ సీక్వెల్ గురించి హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అభిమానులు OG 2 ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం సుజీత్ టీమ్ స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉందట. ముందుగా బ్లడీ రోమియో పూర్తి చేసిన తర్వాతే OG 2 షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఇక ఈ సీక్వెల్‌ను UV Creations మరో నిర్మాణ సంస్థతో కలిసి నిర్మించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే OG నిర్మాత DVV Danayya ఈ సీక్వెల్‌లో భాగం కాకపోవచ్చని వార్తలు వస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు