RRR Anime: యానిమేగా వస్తోన్న రాజమౌళి RRR.. రిలీజ్ ఎప్పుడంటే..?

దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి RRR సినిమాను అనిమేగా రూపొందించాలనుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం జపాన్ స్టూడియోలతో చర్చలు జరుగుతున్నాయి. ఇక మహేష్ బాబు హీరోగా నటిస్తున్న వారణాసి సినిమా షూటింగ్‌లో ఉంది. 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది.

New Update
RRR Anime

RRR Anime

RRR Anime: ప్రఖ్యాత దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి(Rajamouli) ప్రస్తుతం తన కొత్త సినిమా ‘వారణాసి’(Varanasi Movie) పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో టాలీవుడ్ సత్తాను ప్రపంచానికి చూపించాలనే లక్ష్యంతో భారీ స్థాయిలో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్నారు. సినిమా ప్రపంచవ్యాప్తంగా 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది.

ఇటీవల హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ పాలిగాన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి తన గత చిత్రం RRR గురించి ఆసక్తికరమైన విషయం వెల్లడించారు. RRR సినిమాను ఆధారంగా చేసుకుని యానిమే వెర్షన్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు.

ఈ యానిమే ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే కొన్ని జపాన్ స్టూడియోలతో చర్చలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఇంకా అధికారికంగా పనులు ప్రారంభం కాలేదని, కానీ ఈ ఐడియాపై తాను చాలా ఉత్సాహంగా ఉన్నానని రాజమౌళి చెప్పారు. ప్రస్తుతం తాను యానిమేలను ఎక్కువగా చూస్తున్నానని కూడా అన్నారు. ఈ నిర్ణయంతో అనిమే అభిమానులు రాజమౌళిని ప్రశంసిస్తున్నారు.

ఇక వారణాసి సినిమా షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ పాల్గొన్న కొన్ని ఇంటర్వ్యూలు విడుదలయ్యాయి.

ఈ గ్లోబ్ ట్రాటింగ్ మూవీని భారీ బడ్జెట్‌తో శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి అందిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు