Lucifer 2: రజినీ మెచ్చిన లూసిఫర్..

మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ "లూసిఫర్ 2" ట్రైలర్ ను సూపర్ స్టార్ రజినీకాంత్ కు చూపించారు డైరెక్టర్ పృథ్విరాజ్ సుకుమారాన్. ఈ సందర్భంగా రజినీతో దిగిన ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు.

New Update
Lucifer 2

Lucifer 2

Lucifer 2: మోహన్‌లాల్(Mohanlal) హీరోగా తెరకెక్కుతున్న మూవీ "లూసిఫర్ 2: ఎంపురాన్" పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) డైరెక్షన్ చేస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా, పృథ్వీరాజ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ను కలిశారు. ఆ ఫొటోను ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడంతో అది ప్రస్తుతం వైరల్‌గా మారింది.
అయితే, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇటీవల "లూసిఫర్ 2: ఎంపురాన్" ట్రైలర్‌ను రజనీకాంత్‌కు చూపించారు. రజినీకాంత్ ఫ్యాన్ గా ఈ జ్ఞాపకాన్ని ఎప్పటికి గుర్తుంచుకుంటా అని పృథ్విరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా పృథ్విరాజ్ మాట్లాడుతూ.. "నేను 'లూసిఫర్ 2: ఎంపురాన్' ట్రైలర్‌ను మొదట రజినీకాంత్ కు చూపించాను. ఆయన ఈ వీడియో చూసి చెప్పిన మాటలు నాకు ఎప్పటికీ మర్చిపోలేను. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పడం అసాధ్యం. ఎప్పటికీ నేను ఆయన అభిమానిని" అని పేర్కొన్నారు.
గతంలో కూడా రజనీకాంత్‌పై తన అభిమానాన్ని పృథ్వీరాజ్ చాలా సార్లు ప్రకటించారు. తాను రజినీకాంత్ తో మూవీ తీసేందుకు చాలా ఎదురుచూసానాని, కానీ డేట్స్ కుదరక ఆ అవకాశం దక్కలేదని తెలిపారు.  అయితే  ‘లూసిఫర్‌2’ మార్చి 27న థియేటర్లలో సందడి చేయనుంది. 2019 లో వచ్చిన లూసిఫర్ కు సీక్వెల్ గా ‘లూసిఫర్‌2’ రూపొందింది.
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు