Director Maruthi: "ది రాజా సాబ్" పార్ట్ 2 రెడీ..? శ్రీరామనవమి సందర్భంగా డైరెక్టర్ మారుతి క్రేజీ అప్డేట్..!

దర్శకుడు మారుతి, ది రాజా సాబ్ రిజల్ట్ తర్వాత తన కొత్త సినిమాను జాగ్రత్తగా సిద్ధం చేస్తున్నారు. స్క్రిప్ట్ చివరి దశలో ఉందంటూ శ్రీరామనవమి సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ఈ సినిమా కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా వచ్చే సంక్రాంతికి రావచ్చని తెలుస్తోంది.

New Update
Director Maruthi

Director Maruthi

Director Maruthi: దర్శకుడు మారుతి తన నెక్స్ట్ సినిమాపై ఆసక్తికరమైన అప్‌డేట్ ఇచ్చారు. ఇటీవల "ది రాజా సాబ్" ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో, తన తదుపరి ప్రాజెక్ట్‌ను మరింత జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

శ్రీరామనవమి సందర్భంగా మారుతి సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ మెసేజ్ షేర్ చేశారు. ప్రతి ప్రయాణం మనకు ఏదో ఒకటి నేర్పుతుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం తన కొత్త సినిమా కథకు చివరి టచ్‌లు ఇస్తున్నానని, రామయ్య ఆశీస్సులు తనకు ఉన్నాయని తెలిపారు. తనపై నమ్మకం ఉంచిన ప్రేక్షకులు, అభిమానులు, మీడియాకు ధన్యవాదాలు చెప్పారు. భవిష్యత్తులో ఇంకా మంచి సినిమాలు చేయడానికి కష్టపడతానని చెప్పారు. అయితే ఆ కొత్త సినిమా రాజా సాబ్ పార్ట్ 2 నా? లేక వేరే సినిమా నా అని క్లారిటీ ఇవ్వలేదు.

ప్రభాస్ హీరోగా వచ్చిన ‘ది రాజా సాబ్’ సినిమా సంక్రాంతి సమయంలో భారీ అంచనాలతో విడుదలైంది. హారర్ కామెడీగా వచ్చిన ఈ సినిమా మొదటి రోజు మంచి కలెక్షన్లు సాధించినా, తర్వాత నెగెటివ్ టాక్ వల్ల బాక్సాఫీస్ వద్ద జోరు తగ్గిపోయింది. ఈ సినిమా పై సోషల్ మీడియాలో కూడా చాలా ట్రోలింగ్ జరిగింది.

ఈసారి తప్పులు రిపీట్ కాకుండా చూసుకోవాలని మారుతి భావిస్తున్నారని సమాచారం. వచ్చే సంక్రాంతికి కొత్త సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. స్క్రిప్ట్ దాదాపు పూర్తయినందున త్వరలోనే సినిమా వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.

ఈ సినిమాకు ‘హ్యాపీ పొంగల్’ అనే టైటిల్ పెట్టాలని అనుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. ఇది ఫుల్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఉండనుందని తెలుస్తోంది. హీరో విషయానికి వస్తే ఇంకా అధికారికంగా ఏమీ చెప్పలేదు. అయితే మెగా ఫ్యామిలీకి చెందిన హీరోతో సినిమా చేసే ఆలోచనలో ఉన్నారని, వరుణ్ తేజ్ పేరు కూడా వినిపిస్తోంది.

ఏ సంక్రాంతికి విమర్శలు ఎదుర్కొన్నారో, అదే సీజన్‌లో హిట్ కొట్టి తిరిగి నిలబడాలని మారుతి ప్లాన్ చేస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి ప్రేక్షకులకు నవ్వులు పంచే పూర్తి ఎంటర్టైనర్ ఇవ్వాలని ఆయన కష్టపడుతున్నారు.

మొత్తానికి, ‘ది రాజా సాబ్’ తర్వాత మారుతి తీసుకునే ఈ కొత్త సినిమా ఆయన కెరీర్‌కు చాలా ముఖ్యమైనదిగా మారింది. త్వరలోనే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు