/rtv/media/media_files/2025/12/07/rajamouli-varanasi-2025-12-07-06-45-28.jpg)
Rajamouli Varanasi
Rajamouli Varanasi: సూపర్‌స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా తెరకెక్కుతున్న ఎస్.ఎస్. రాజమౌళి కొత్త చిత్రం ‘వారణాసి’ పై దేశవ్యాప్తంగా భారీ ఆసక్తి ఉంది. ప్రపంచ స్థాయి యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందుతున్న ఈ సినిమా బడ్జెట్ సుమారు 1000 కోట్ల వరకు ఉండడం వల్లే అంచనాలు ఆకాశాన్నంటాయి. ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ చూసిన ప్రేక్షకులు అద్భుతమైన విజువల్స్ చూసి మంత్రముగ్ధులయ్యారు.
Deva Katta About Rajamouli Varanasi
ఇప్పటికే ఈ చిత్రం టైం-ట్రావెల్ కథ అని చెప్పుకుంటున్న నేపథ్యంలో, టాలీవుడ్ దర్శకుడు దేవ కట్ట(Deva Katta) తాజా ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు మరింత హైప్ తెచ్చాయి. రాజమౌళి చూపుతున్న విజన్ గురించి దేవ కట్ట ప్రత్యేకంగా మాట్లాడారు. రాజమౌళి ఈ కథను తెరపై చూపుతున్న తీరు ఇప్పటి వరకు మనం చూసిన వాటన్నింటికంటే ఎక్కువగా ఉంటుందని ఆయన తెలిపారు.
దేవ కట్ట మాట్లాడుతూ, “మగధీర, ఈగ, బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ అన్ని ఒక స్థాయిలో ఉంటే, వాటన్నింటి కంటే ఇంకా పెద్ద స్థాయికి తీసుకెళ్తుంది వారణాసి.” అని అన్నారు. ఈ సినిమాలో రాజమౌళి చూపిస్తున్న భావోద్వేగం, కథనం, భారీ విజువల్స్ అన్నీ లాజిక్ కి మించిన ఒక కొత్త అనుభూతిని ఇస్తాయని ఆయన చెప్పారు.
గతంలో దేవ కట్ట, బాహుబలి వెబ్ సిరీస్ కోసం రాజమౌళితో కలిసి పనిచేశారు. ఆ ప్రాజెక్ట్ జరిగినప్పటికీ, వ్యక్తిగత కారణాల వల్ల అది ఎండ్ అయిపోయింది. అయినా రాజమౌళిపై ఆయనకు ఉన్న గౌరవం ఇంకా అలాగే ఉంది. వారణాసి కోసం దేవ కట్ట డైలాగ్స్ కూడా రాస్తున్నారు. రాజమౌళి స్క్రిప్ట్ తనకు ఇచ్చినా కూడా తాను ఆ స్థాయిలో చేయలేనని, రాజమౌళి ఊహాశక్తి చాలా ఎక్కువ అని ఆయన తెలిపారు.
ఈ చిత్రంలో మహేష్ బాబు తో పాటు ప్రియాంక చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. సంగీతం ఎం.ఎం. కీరవాణి అందిస్తున్నారు.
దేవ కట్ట చేసిన వ్యాఖ్యలతో, వారణాసి ఒక అద్భుతమైన, ఇప్పటి వరకు చూడనటువంటి అనుభవాన్ని ప్రేక్షకులకు ఇవ్వబోతుందని తెలుస్తోంది. ఈ భారీ సినిమా 2027లో థియేటర్లలో విడుదల కానుంది.
Follow Us