/rtv/media/media_files/2026/06/07/jhanvi-kapoor-2026-06-07-14-58-09.jpg)
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. కలెక్షన్ల పరంగా దుమ్మురేపుతున్నప్పటికీ, ఈ సినిమా ఒక పెద్ద వివాదంలో చిక్కుకుంది. సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ ను చూపించిన విధానం, కొన్ని రొమాంటిక్ సీన్లపై సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి.
సినిమాలో హీరోయిన్ అందాన్ని వర్ణించేటప్పుడు ఆమె ముఖాన్ని చూపించకుండా, కెమెరాను కేవలం ఆమె శరీర భాగాలపైనే జూమ్ చేస్తూ చూపించారని ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా, ఒక సీన్లలో కరెంట్ పోయినప్పుడు హీరోయిన్‌కు ఇష్టం లేకపోయినా హీరో బలవంతంగా ముద్దు పెట్టుకుంటాడని, ఇది ముమ్మాటికీ వేధింపుల కిందకే వస్తుందని నెటిజన్లు మండిపడుతున్నారు. విలన్లు చేస్తే తప్పు అయినప్పుడు, హీరోలు చేస్తే అది రొమాన్స్ ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు.
అయితే ఈ వివాదంపై హీరోయిన్ డింపిల్ హయతి ఎక్స్ వేదికగా స్పందించింది. "ఇండస్ట్రీలో హీరోయిన్ల క్యారెక్టర్లను ఎలా రాస్తున్నారు? సినిమా రిలీజ్ అయ్యాక, ఇచ్చిన రోల్ చేసినందుకు హీరోయిన్లనే ఎలా బ్లేమ్ చేస్తున్నారు? అనే విషయంపై ఈరోజు అందరూ మాట్లాడటం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇందులో హీరోయిన్ తప్పు లేదు, ఇలాంటి సీన్లు పెడితేనే సినిమాలు ఆడుతాయని అనుకునే డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లను, ఇక్కడి సిస్టమ్‌ను అనాలి" అంటూ కామెంట్ చేసింది.
హీరోయిన్లకు ఉండే ఇబ్బందులను చెప్తూ.. "మాకు ఒక ఇమేజ్ క్రియేట్ చేసి అందులోనే ఉంచేస్తారు. మా టాలెంట్ చూపించుకునే ఛాన్స్ ఇవ్వకుండా, వాళ్లు రాసిన క్యారెక్టర్లనే చేయాల్సి వస్తుంది. స్క్రీన్ మీద ఏం చూపిస్తే జనాలు దాన్నే నమ్ముతారు, ఇది నిజంగా బాధాకరం. మనమంతా మంచి సినిమాలకు, మంచి క్యారెక్టర్లకు అర్హులం" అని డింపిల్ రాసుకొచ్చింది.
డిఫరెంట్‌గా అనసూయ
అయితే, నటి అనసూయ భరద్వాజ్ మాత్రం ఈ విషయంలో కొంచెం డిఫరెంట్‌గా స్పందించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెడుతూ.. "సినిమా అనేది సమాజంలో జరిగే విషయాలనే చూపిస్తుంది. అంతేకానీ సమాజాన్ని మార్చాలి, బుద్ధి చెప్పాలి అనే పూర్తి బాధ్యతను సినిమా మీదే పెట్టేయకూడదు" అని అంది. సినిమాలకు జనాలను ఇన్‌ఫ్లుయెన్స్ చేసే పవర్ ఉన్నప్పటికీ.. ఏది మంచి, ఏది చెడు అని ఆలోచించుకునే బాధ్యత చూసే ప్రేక్షకులకు కూడా ఉంటుందని అనసూయ క్లియర్‌గా చెప్పింది.
Follow Us