/rtv/media/media_files/2024/12/02/rTnB0Ayx1SKET0fufRPv.jpg)
RGV: వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ మరోసారి వార్తల్లో ఎక్కారు. ఇప్పటికే సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పై అసభ్యకర పోస్టు పెట్టినందుకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే తనను పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో పరారీలో ఉన్నానని జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టేందుకు ఆర్జీవీ గత కొన్ని రోజులుగా అన్ని ఛానెల్స్ కు ఇంటర్వ్యూ ఇస్తూ వచ్చారు. తాజాగా కొన్ని ఛానెల్స్ పై కేసు పెడుతున్నట్లు ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఏపీ ఫైబర్ నెట్ కేసులో వాస్తవాలు తెలియకుండా.. తన పరువుకు భంగం కలిగించేలా తప్పుడు ప్రచారాలు చేసిన కొన్ని ఛానెల్స్ పై పరువు నష్టం కేసు పెడుతున్నట్లు పోస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: కేసీఆర్ కు ఆహ్వానం అందించిన మంత్రి పొన్నం..!
అసలు విషయం ఇదే అంటూ...
తనపై, తన పార్టనర్ రవివర్మ పైన వచ్చిన ఆరోపణల తాలూకు వాస్తవాలు.. అవాస్తవాలను ప్రచారం చేస్తే ఊరుకోను అంటూ ఆర్జీవీ హెచ్చరించారు. ఆయన ట్విట్టర్ లో..
"1. ‘వ్యూహం’ సినిమా దాసరి కిరణ్‌కుమార్ నిర్మాత కాగా
శ్రీకాంత్ ఫైనాన్స్‌ను అందించారు.
2. నా పార్టనర్ రవివర్మ సొంతంగా ఫైనాన్షియర్ శ్రీకాంత్ నుండి ఏపి ఫైబర్ నెట్ ప్రసారహక్కులను కొనుగోలు చేశారు.
3. ఏపి ఫైబర్‌నెట్ రవివర్మ నుండి ప్రసార హక్కులను రెండుకోట్ల వ్యయంతో కొనుగోలు చేసింది. కానీ కోటి రూపాయలు మాత్రమే ఎకౌంట్‌కు వచ్చింది. ఇది శ్రీకాంత్, రవివర్మలకు సంబంధించిన ఒప్పందం.
ఇది కూడా చదవండి: ఇదెక్కడి వింతరా బాబు.. బంగారు నగలతో పిల్లికి శ్రీమంతం.. మామూలుగా లేదుగా!
4. ఈ హక్కులు ఏపి ఫైబర్‌నెట్‌కు 60 రోజులపాటు ఇవ్వబడ్డాయి. ఏపి ఫైబర్‌నెట్ వారు చెప్పిన ప్రకారం లక్షా యాభైవేల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఆ సమయంలో టీడీపీ పార్టీ ఎలక్షన్ కమీషన్‌కి కంప్లైంట్ ఇవ్వటంతో ప్రసారాలను నిలిపివేశారు. రవివర్మకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ ఎమౌంట్‌ను ఏపి ఫైబర్‌నెట్ నిలిపివేసింది.
5. తన బకాయి మొత్తం చెల్లించనందున నా పార్టనర్ రవివర్మ సివిల్ కోర్టులో కేసు పెట్టారు.
6. అలాగే రవివర్మ పైన, నా పైన తప్పుగా ప్రచారం చేసి మా పరువుకు భంగం కలిగించిన కొన్ని టీవి ఛానల్స్ టీవి5, ఏబిఎన్, మహా టీవి మరియు కొన్ని ఛానల్స్‌పై నష్ట పరిహారం కోసం కేసులు పెడుతున్నాం." అని పోస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: BIG BREAKING: ఆ గ్రామాలకు జిల్లాలు మార్పు!
ఇది కూడా చదవండి: రహాదారిపై కాంగ్రెస్ ఎంపీ అత్యుత్సాహం.. వాహనాలను ఆపి..!