Dhurandhar 2: ‘బాహుబలి 2’ రికార్డ్ లేపేసిన ‘ధురంధర్: ది రివెంజ్’.. శోభు యార్లగడ్డ వైరల్ పోస్ట్!

‘ధురంధర్: ది రివెంజ్’ సినిమా నార్త్ అమెరికాలో ‘బాహుబలి 2’ రికార్డును బ్రేక్ చేసి కొత్త రికార్డ్ సృష్టించింది. రణవీర్ సింగ్ నటించిన ఈ చిత్రం రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ విజయంపై నిర్మాత శోభు యార్లగడ్డ చిత్ర బృందాన్ని అభినందించారు.

New Update
Dhurandhar 2

Dhurandhar 2

Dhurandhar 2: ‘ధురంధర్: ది రివెంజ్’ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేస్తోంది. ఈ చిత్రం తాజాగా మరో పెద్ద రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటివరకు నార్త్ అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా నిలిచిన ‘బాహుబలి 2’(Baahubali 2) రికార్డును ఈ సినిమా దాటింది. దాదాపు తొమ్మిదేళ్లుగా నిలిచిన ఆ రికార్డు ఇప్పుడు బ్రేక్ అవ్వడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఈ నేపథ్యంలో ‘బాహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డ సోషల్ మీడియాలో స్పందించారు. ఆయన ఈ సినిమాను చూసి చాలా ఆనందించానని చెప్పారు. సినిమా చాలా బాగా నచ్చిందని, అన్ని రికార్డులు బద్దలవుతుండడం చూసి సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. సినిమా టీమ్ మొత్తానికి అభినందనలు తెలిపారు.

రణవీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వేగంగా వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటివరకు ఈ చిత్రం రూ.1100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ముఖ్యంగా సెలవులు లేకపోయినా ఈ స్థాయిలో విజయాన్ని అందుకోవడం మరింత ప్రత్యేకంగా మారింది.

ఈ చిత్రంలో మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేష్ బేడి ముఖ్య పాత్రల్లో నటించారు. జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ కలిసి ఈ సినిమాను నిర్మించారు.

ప్రస్తుతం ఈ సినిమా వేగం చూస్తే, ఇకపై ఈ రికార్డును ఎవరు దాటుతారు అన్నది ఆసక్తిగా మారింది.

Advertisment
తాజా కథనాలు