/rtv/media/media_files/2026/04/12/darling-4k-trailer-2026-04-12-09-48-10.jpg)
Darling 4k Trailer
Darling 4k Trailer: రెబల్ స్టార్ ప్రభాస్ Prabhas నటించిన రాజా సాబ్ The Raja Saab సినిమా సంక్రాంతికి విడుదలై అభిమానులను నిరాశపరిచింది. ఈ సినిమాతో దర్శకుడు మారుతీ Maruthi ప్రభాస్‌ను సరిగ్గా చూపించలేకపోయాడని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. సినిమా కథ కూడా ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకోలేకపోయింది.
అయితే సంక్రాంతి సమయంలో నిరాశ చెందిన అభిమానులకు ఈ సమ్మర్‌లో మంచి ట్రీట్ ఇవ్వడానికి ప్రభాస్ రెడీ అయ్యారు. ప్రస్తుతం ఆయన కొత్త సినిమా రిలీజ్ కాకపోయినా, ఒక ప్రత్యేక ప్లాన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
/filters:format(webp)/rtv/media/media_files/2026/04/12/darling-4k-trailer-2026-04-12-09-48-25.jpg)
ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ బాగా పెరిగింది. పాత హిట్ సినిమాలను మళ్లీ థియేటర్లలో విడుదల చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. హీరోల పుట్టినరోజులు లేదా ప్రత్యేక సందర్భాల్లో ఈ సినిమాలను 4K వెర్షన్‌లో తీసుకొస్తున్నారు. ఈ ట్రెండ్ మంచి రెస్పాన్స్ పొందుతోంది.
ఈ నేపథ్యంలో ప్రభాస్ నటించిన సూపర్ హిట్ ప్రేమ కథా చిత్రం డార్లింగ్ Darling ను మళ్లీ థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 23, 2026న 4K వెర్షన్‌లో రీ రిలీజ్ కానుంది.
ఇప్పటికే ఈ రీ రిలీజ్‌కు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రైలర్ చూసి అభిమానులు ఫుల్ ఖుషి అయిపోతున్నారు. సంక్రాంతికి ఇవ్వాల్సిన ఆనందాన్ని ఇప్పుడు ఇస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు.
‘డార్లింగ్’ సినిమాలో ప్రభాస్‌కు జంటగా కాజల్ అగర్వాల్ Kajal Aggarwal నటించారు. ఈ చిత్రాన్ని దర్శకుడు ఎ కరుణాకరన్ A Karunakaran తెరకెక్కించారు. సంగీతాన్ని G V ప్రకాష్ కుమార్ G V Prakash Kumar అందించారు.
ఈ సినిమా 2010లో విడుదలై మంచి విజయం సాధించింది. ప్రేమ, కామెడీ, ఎమోషన్స్ తో కూడిన కథతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో ప్రభాస్ పాత్ర సాదాసీదా యువకుడిలా ఉండటం ప్రేక్షకులకు బాగా నచ్చింది.
ఇప్పుడు ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా మారిన తర్వాత, ఈ సినిమా మళ్లీ విడుదల అవుతుండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ, కొత్త ప్రేక్షకులకు కూడా ఈ ప్రేమ కథను చూపించాలనే ఉద్దేశంతో ఈ రీ రిలీజ్ చేస్తున్నారు.
మొత్తానికి ‘డార్లింగ్’ రీ రిలీజ్ ఈ సమ్మర్‌లో ప్రభాస్ అభిమానులకు ఒక మంచి గిఫ్ట్‌గా మారనుంది.
Follow Us