Dacoit OTT: ఓటీటీలోకి అడివి శేష్ - మృణాల్ క్యూట్ లవ్ స్టోరీ! 'డెకాయిట్' స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే?

Dacoit థియేటర్లలో సూపర్ హిట్ సక్సెస్ తర్వాత ఓటీటీలోకి రానుంది. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ నటించిన ఈ చిత్రం మే 8, 2026 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

New Update
Dacoit Songs

Dacoit OTT

Dacoit OTT: యంగ్ హీరో అడివి శేష్ Adivi Sesh, మృణాల్ ఠాకూర్ Mrunal Thakur కలిసి నటించిన యాక్షన్ లవ్ స్టోరీ Dacoit థియేటర్లలో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా మంచి కలెక్షన్లు సాధించి, వీకెండ్స్‌లో బలమైన బుకింగ్స్‌తో దూసుకుపోయింది.

ఈ సినిమా విజయానికి అడివి శేష్ నటన, మృణాల్ గ్లామర్, అలాగే సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో Bheems Ceciroleo అందించిన సంగీతం ముఖ్య కారణాలుగా నిలిచాయి. ఈ చిత్రాన్ని షానియల్ డియో Shaniel Deo తెరకెక్కించారు.

ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ Netflix నెట్‌ఫ్లిక్స్ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ మొత్తానికి తీసుకుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం 2026 మే 8 నుంచి పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.

ఈ సినిమాను సుప్రియ యార్లగడ్డ Supriya Yarlagadda, సునీల్ నారంగ్ Suniel Narang నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ Annapurna Studios ఈ చిత్రాన్ని సమర్పించింది.

ఇక ఈ సినిమాలో అనురాగ్ కశ్యప్ Anurag Kashyap, ప్రకాష్ రాజ్ Prakash Raj, సునీల్ Sunil, అతుల్ కులకర్ణి Atul Kulkarni, జైన్ మేరీ ఖాన్ Zayn Marie Khan, Kamakshi Bhaskarla వంటి వారు కీలక పాత్రల్లో కనిపించారు.

థియేటర్లలో మిస్ అయినవారికి లేదా మళ్లీ ఈ సినిమాను చూడాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ పొందుతుందో చూడాలి.

Advertisment
తాజా కథనాలు