/rtv/media/media_files/2025/03/18/iftJkKdjZIzY85a8zF8r.jpg)
Court Movie Collections
Court Weekend Collections: కోర్ట్ రూమ్ డ్రామా జానర్‌లో తెరకెక్కిన 'కోర్ట్' మూవీ సూపర్ సక్సెస్ గా థియేటర్లలో సందడి చేస్తోంది. నాని(Nani) ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ కేవలం మౌత్ టాక్ తోనే అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రీమియర్ షోల నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకొని దూసుకుపోతుంది.
'కోర్ట్' మొదటి రోజే రూ.8 కోట్ల పైగా వసూళ్లను సాధించి ఆశ్చర్యపరిచింది. 5 రోజులు పూర్తయ్యేసరికి మొత్తం రూ.33.55 కోట్ల గ్రాస్ రాబట్టినట్టు మూవీ టీమ్ తెలిపారు.
Also Read: ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న 'లూసిఫర్2: ఎంపురాన్' ట్రైలర్..!
'ది బెస్ట్' మూవీగా కోర్ట్..
ఇప్పటివరకు తెలుగులో వచ్చిన కోర్ట్ రూమ్ డ్రామాలలో ఇది 'ది బెస్ట్' మూవీగా నిలిచింది. ప్రొడ్యూసర్ నుంచి డిస్టిబ్యూటర్ల వరకు మంచి లాభాలను పొందారు. సినిమా బడ్జెట్ కంటే దాదాపుగా మూడు రెట్లు అధిక వసూళ్లు సాధించింది.
అదే విధంగా ఓవర్సీస్ లో సినిమా కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా 800k డాలర్స్ వసూలు చేసి మిలియన్ డాలర్ మార్క్ దగ్గరలో ఉంది. ఇక తెలుగులో వీకెండ్ ముగిసేసరికి రూ.50 కోట్ల మార్క్‌ను దాటే అవకాశం ఉందని అంచనా.
'కోర్ట్' సినిమా లవ్ స్టోరీ, ఎమోషన్, భావోద్వేగాలతో ఒక కొత్త అనుభూతిని ప్రేక్షకులకు అందించడమే కాకుండా తక్కువ బడ్జెట్ మూవీస్ కి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. చిన్న సినిమాగా వచ్చి భారీ సక్సెస్ తో థియేటర్లలో అదరగొడుతోంది.