JETLEE Release Trailer: "సింగిల్ స్క్రీన్.. మల్టీప్లెక్స్.. ఇబొమ్మా.." ఇంట్రెస్టింగ్ గా 'జెట్లీ' రిలీజ్‌ ట్రైలర్‌!

కమెడియన్ సత్య హీరోగా రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన 'జెట్లీ' మే 1, 2026న విడుదల కానుంది. ‘ఆపరేషన్ డైనోసార్’ కథతో కామెడీ థ్రిల్లర్‌గా రూపొందింది. వెన్నెల కిశోర్, వైవా హర్ష నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ కొత్త ట్రైలర్ రిలీజ్ అయింది.

New Update
JETLEE Release Trailer

JETLEE Release Trailer

JETLEE Release Trailer: కమెడియన్ సత్య Satya ఇప్పుడు హీరోగా మారి నటించిన కొత్త సినిమా "జెట్లీ" (Jetlee) మీద ఆసక్తి పెరుగుతోంది. ఈ సినిమాకు రితేష్ రానా Ritesh Rana దర్శకత్వం వహించారు.

ఇటీవల ఈ సినిమా నుంచి కొత్త రిలీజ్ ట్రైలర్‌ను ఈ రోజు గురువారం విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తే సినిమా కామెడీతో పాటు మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉండబోతుందని అర్థమవుతోంది.

ట్రైలర్‌లో ఒక సన్నివేశంలో హీరో "ఇంతకి మీరు దేంట్లో చూస్తున్నారు ఈ సినిమాను? సింగిల్ స్క్రీన్.. మల్టీప్లెక్స్.. ఓటీటీ.. ఐబొమ్మా..?" అంటూ చెప్పి నవ్వులు పూయిస్తాడు. ఈ డైలాగ్ ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచింది.

ఈ సినిమా కథ ‘ఆపరేషన్ డైనోసార్’ అనే అంశం చుట్టూ నడుస్తుంది. కామెడీతో పాటు కొత్త కాన్సెప్ట్‌తో సినిమా రూపొందించారు.

ఈ సినిమాలో పలువురు ప్రముఖ కమెడియన్లు కూడా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్ Vennela Kishore, వైవా హర్ష Viva Harsha, అజయ్ వంటి వారు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ సినిమాతో రియా సింఘా Rhea Singha హీరోయిన్‌గా తెలుగు సినిమాల్లోకి అడుగుపెడుతున్నారు. ఆమె ‘మిస్ యూనివర్స్ ఇండియా 2024’ విజేత కూడా.

ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ Mythri Movie Makers సమర్పణలో, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చెర్రీ నిర్మిస్తున్నారు. సంగీతాన్ని Kala Bhairava అందిస్తున్నారు.

సెన్సార్ నుంచి ఈ సినిమాకు ఇప్పటికే U/A సర్టిఫికెట్ వచ్చింది. "జెట్లీ" సినిమా మే 1, 2026న థియేటర్లలో విడుదల కానుంది. సమ్మర్ స్పెషల్‌గా వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను బాగా నవ్వించబోతుందని చిత్రబృందం చెబుతోంది.

సత్య తన కామెడీ టైమింగ్‌తో పాటు రితేష్ రానా ప్రత్యేకమైన దర్శకత్వ శైలితో ఈ సినిమా టాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంటుందని అంచనా వేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు