దేవిశ్రీ ప్రసాద్ ను వివాదంలోకి లాగిన సీఎం రేవంత్.. షాక్ లో ఫ్యాన్స్! దేవిశ్రీప్రసాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్న కాన్సర్ట్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.స్టేడియాలను కేవలం స్పోర్ట్స్ కోసమే వాడుతామని గతంలో సీఎం చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు షేర్ చేస్తున్నారు. మ్యూజిక్ షో కోసంస్టేడియంను పాడు చేస్తారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. By Anil Kumar 17 Oct 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి టాలీవుడ్ రాక్ స్టార్, నేషనల్ అవార్డు విజేత మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ హైదరాబాద్ లో మ్యూజికల్ కాన్సెర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. లైవ్ ఇండియా టూర్ లో భాగంగా.. దేవి తన ఫస్ట్ లైవ్ కాన్సెర్ట్ ను హైదరాబాద్ నుంచే ప్రారంభిస్తున్నారు. ఈ లైవ్ కాన్సర్ట్ అక్టోబరు 19న సాయంత్రం గచ్చిబౌలి స్టేడియంలో జరగనుంది. ఈ గ్రాండ్ మ్యూజికల్ ఈవెంట్ ను ACTC అనే ఈవెంట్ సంస్థ నిర్వహిస్తోంది. Also Read : పవర్ స్టార్ టైటిల్ తో యాంకర్ ప్రదీప్ సినిమా.. ఆకట్టుకునేలా మోషన్ పోస్టర్ బండ్లన్న రాయబారంతోనే ఈవెంట్ కు అనుమతి లభించిందా ?దేవిశ్రీ ప్రసాద్ కోసం రేవంత్ రెడ్డి U-టర్న్ తీసుకున్నాడా ?గతంలో స్పోర్ట్స్ స్టేడియంలలో క్రీడలు తప్ప మరే ఇతర ఈవెంట్స్ నిర్వహించకూడదన్నరు నేడేమో గచ్చిబౌలి స్టేడియంలో సంగీత దర్శకుడు డీఎస్పీ మ్యూజికల్ ఈవెంట్కు అనుమతి ఎట్లా… pic.twitter.com/Xrg3DrYr5k — Charnakol (@charnakol) October 16, 2024 కాగా దేవి తన కాన్సర్ట్ కోసం ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను స్వయంగా కలిసి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి.. గచ్చిబౌలి స్టేడియంలో మ్యూజికల్ కాన్సర్ట్ కు పర్మిషన్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. రేవంత్ పర్మిషన్ ఇవ్వడం ఇప్పుడు సరికొత్త వివాదానికి దారి తీసింది. ఈ వివాదంలో దేవిశ్రీ ప్రసాద్ అనవసరంగా ఇరుక్కున్నట్లు అయింది. Also Read : 'బాహుబలి 3' పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. ఏమన్నారంటే? @TNewsTelugu @6:30pm స్టేడియాలను క్రీడేతర కార్యక్రమాలకు ఇవ్వమని చెప్పిన రేవంత్ రెడ్డిగచ్చిబౌలి స్టేడియంలో ప్రైవేట్ ప్రోగ్రాంOct 19న గచ్చిబౌలి స్టేడియంలో దేవిశ్రీ ఈవెంట్ఈవెంట్ కోసం స్టేడియంలో భారీగా గుంతల తవ్వకాలు. అధికారంలోకి వచ్చాక రూ. 20 cr ఖర్చుతో స్టేడియానికి మెరుగులు — Shailesh Reddy Speaks (@shaileshreddi) October 16, 2024 మ్యాటర్ ఏంటంటే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి.. గచ్చిబౌలి స్టేడియంలో కేవలం క్రీడలు తప్ప మరే ఇతర ఈవెంట్స్ ను నిర్వహించమని సభా ముఖంగా అన్నారు. కానీ ఇప్పుడేమో మ్యూజికల్ కాన్సర్ట్ కు పర్మిషన్ ఇవ్వడంతో స్టేడియంలో ఈవెంట్ కోసం భారీగా గుంతలు తవ్వినట్లు తెలుస్తోంది. నిజానికి రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చాక సుమారు రూ. 20 కోట్లు ఖర్చుతో స్టేడియానికి మెరుగులు దిద్దారు. Also Read : 'పుష్ప 2' లో 'యానిమల్' విలన్.. సుకుమార్ ఏం ప్లాన్ చేస్తున్నాడో? Has CM Revanth given permission for Musical Night in Gachibowli Stadium ❓ pic.twitter.com/faNDx95hmF — Krishank (@Krishank_BRS) October 16, 2024 రేవంత్ యూ టర్న్.. ఇప్పుడు అందులోనే గుంతలు తవ్వడంతో ఆ ఖర్చు అంతా వృథానేనా? అంటూ ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా గచ్చిబౌలి స్టేడియంలో కాన్సర్ట్ పెట్టడానికి వీలు లేదని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి అప్పుడు ఓకే మాట చెప్పి.. ఇప్పుడు మాట మారుస్తున్నాడని, సినిమా వాళ్ళ కోసం యూ టర్న్ తీసుకున్నాడని ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. Also Read : మరోసారి కొండా సురేఖకు సమంత కౌంటర్! ఏమందో తెలిస్తే షాకే 🎶❤️🎶 https://t.co/K5jJB4t2Bz — DEVI SRI PRASAD (@ThisIsDSP) October 15, 2024 టెన్షన్ లో ఫ్యాన్స్.. మరోవైపు దేవీశ్రీ ప్రసాద్ ఫ్యాన్స్ ఏమో ఈ కాన్సర్ట్ కోసం వేల రూపాయలు ఖర్చు చేసి టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఇప్పుడు ఇదంతా చూస్తుంటే ఎక్కడ కాన్సర్ట్ క్యాన్సిల్ అయిపోతుందేమోనని టెన్షన్ పడుతున్నారు. ఒకవేళ కాన్సర్ట్ క్యాన్సిల్ అయితే డబ్బులు తిరిగిస్తారా? లేదా? అనేది కూడా డౌటే.. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి. HYDERABAD, only 10 more days to witness the Rockstar energy LIVE 🕺🏻🎸🤘!!! @ThisIsDSP😎 DSP Live in Hyderabad - 19th October 2024 @ Gachibowli Stadium 😎Grab Your Tickets Now ❤️🔥🔗 https://t.co/nQPvWraJZt@insider.in#DSPLiveIndiaTour #DSP #DeviSriPrasad #DSPLive… pic.twitter.com/eMwOTvRSxK — ACTC Events (@actcevents) October 9, 2024 #revanth-reddy #devisriprasad మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి