Peddi Release: పర్సంటేజ్ వివాదానికి బ్రేక్.. మెగాస్టార్ ఎంట్రీతో ‘పెద్ది’కు లైన్ క్లియర్..!

మెగాస్టార్ చిరంజీవి జోక్యంతో టాలీవుడ్‌లో నెలకొన్న పర్సంటేజ్ వివాదం తాత్కాలికంగా పరిష్కారమైంది. ‘పెద్ది’ సినిమాను తెలంగాణలో పాత రెంటల్ విధానంలో విడుదల చేయడానికి ఎగ్జిబిటర్లు అంగీకరించారు. జూన్ 30 వరకు ఇదే విధానం కొనసాగనుంది. దీంతో జూన్ 4న ‘పెద్ది’ రిలీజ్‌కు లైన్ క్లియర్ అయ్యింది.

New Update
Peddi Release

Peddi Release

Peddi Release: టాలీవుడ్‌లో గత కొంతకాలంగా నడుస్తున్న పర్సంటేజ్ విధాన వివాదానికి మెగాస్టార్ చిరంజీవి జోక్యంతో తాత్కాలికంగా పరిష్కారం లభించింది. దీంతో రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమాకు థియేటర్ రిలీజ్ విషయంలో లైన్ క్లియర్ అయ్యింది.

ఇప్పటివరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమాలను అద్దె విధానంలో కాకుండా పర్సంటేజ్ మోడల్‌లో ప్రదర్శించాలనే డిమాండ్ ఎగ్జిబిటర్ల నుంచి వస్తోంది. ఈ అంశంపై నిర్మాతలు, థియేటర్ యజమానుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.

ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు చిరంజీవి ఇటీవల ఎగ్జిబిటర్లతో సమావేశమయ్యారు. మే 25న జరిగిన భేటీలో సమస్యపై చర్చించిన తర్వాత, తాజాగా మరోసారి చర్చలు జరిపారు.

ఈ చర్చల ఫలితంగా రాబోయే ‘పెద్ది’ సినిమాను ప్రస్తుతం ఉన్న పాత రెంటల్ విధానంలోనే ప్రదర్శించేందుకు తెలంగాణ ఎగ్జిబిటర్లు అంగీకరించారు. జూన్ 30 వరకు విడుదలయ్యే సినిమాలకు పాత విధానం కొనసాగుతుందని, ఆ తర్వాత వచ్చే సినిమాలకు మాత్రమే పర్సంటేజ్ మోడల్ అమలు చేయాలని నిర్ణయించారు.

ఈ నిర్ణయంతో ‘పెద్ది’ విడుదలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా మారింది. జూన్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

టాలీవుడ్‌లో నెలకొన్న ఈ వివాదానికి చిరంజీవి జోక్యం వల్ల తాత్కాలికంగా రిలీఫ్ లభించినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు