Chiranjeevi: వరద బాధితుల కోసం సీఎం రేవంత్ రెడ్డికి రూ. కోటి చెక్కు! మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి తన వంతు విరాళం అందించారు. నేడు సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో స్వయంగా కలిసి రూ. కోటి చెక్కును అందజేశారు. రామ్ చరణ్ తరపున 50 లక్షలు, ఆయన తరుపున 50 లక్షలు ఇచ్చారు. By Archana 16 Sep 2024 | నవీకరించబడింది పై 16 Sep 2024 15:19 IST in సినిమా Short News New Update షేర్ చేయండి Chiranjeevi : గత వారం కిందట భారీ వర్షాల (Heavy Rains) తో రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. వరద నీటి ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాలు, గ్రామాలూ నీట మునిగిపోయాయి. ప్రజలు తినడానికి తిండి, ఉండడానికి గూడు లేక నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రకటిస్తున్నారు. ఈ విపత్తులో వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు, సినీ తారలు ముందుకొచ్చి తమ విరాళాలు ప్రకటించారు. తమ వంతు సాయంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందించారు. సీఎం రేవంత్ రెడ్డికి మెగాస్టార్ రూ. కోటి చెక్కు ఈ నేపథ్యంలో తాజాగా.. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తో సహా పలువురు సినీ తారలు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ని జూబిహిల్స్ లోని ఆయన నివాసంలో స్వయంగా కలిసి చెక్స్ అందజేశారు. చిరంజీవి రూ. కోటి చెక్కును ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు. రామ్ చరణ్ తరుపున రూ. 50 లక్షలు, ఆయన తరుపున రూ. 50 లక్షలు ఇచ్చారు. కమెడియన్ అలీ, హీరో విశ్వక్ సేన్, హీరో సాయి ధరమ్ కూడా తమ చెక్కులను అందజేశారు. అలీ రూ. 3 లక్షలు, సాయి ధరమ్ తేజ్ రూ. 10 లక్షలు, విశ్వక్ సేన్ రూ. లక్షల చెక్కును ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విరాళాలు ప్రకటించిన తారలు అంతే కాదు తెలంగాణ, ఆంద్రప్రదేశ్ వరద బాధితుల కోసం జూనియర్ ఎన్టీఆర్ రూ. కోటి, నందమూరి బాలకృష్ణ రూ. కోటి, అల్లు అర్జున్ రూ. కోటి మహేష్ బాబు రూ. కోటి, పవన్ కళ్యాణ్ రూ. కోటి, సిద్దు జొన్నలగడ్డ రూ. 30 లక్షలు, వైజయంతి రూ. 25లక్షలు, హాసిని హారిక ఎంటర్ టైన్మెంట్స్ రూ. 50 లక్షల విరాళాలు ప్రకటించారు. విపత్తు సమయంలో బాధితులకు అండగా సినీ తారలు ముందుకు రావడాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. Also Read: Emmy Awards 2024 Winners: ఈ కామెడీ సిరీస్‌కు అవార్డుల పంట.. ఎమ్మీ అవార్డ్స్ విజేతల జాబితా ఇదే! #cm-revanth-reddy #megastar-chiranjeevi #telangana-floods #andhra-pradesh-floods మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి