Chiruచిరు వర్సెస్ మోహన్ బాబు..మరోసారి తెరపైకి లెజెండరీ అవార్డు వివాదం

చిరంజీవికి ఏఎన్ఆర్ నేషనల్ అవార్డును అందజేశారు అమితాబ్. అవార్డు అందుకున్న తరువాత చిరు ఎమోషనల్‌ అయ్యారు...పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌ లోకి వెళ్లండి.

New Update
legeda

Chiranjeevi:  ఏఎన్నాఆర్‌ జాతీయ అవార్డు 2024ను టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ చేతులు మీదుగా అందుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన అక్కినేని జాతీయ పురస్కార వేడుకకి ముఖ్య అతిథిగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్‌ వచ్చారు. ఆయన చేతుల మీదుగానే ఈ పురస్కారాన్ని చిరంజీవి తీసుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా సెప్టెంబరు 20న నాగార్జున ఈ అవార్డును చిరంజీవికి ప్రకటించారు. 

ఈ కార్యక్రమానికి అక్కినేని, చిరంజీవి కుటుంబ సభ్యులు సహా పలువురు సినీ ప్రముఖులు కూడా విచ్చేశారు. ఇక అవార్డు ప్రదానం చేసిన వెంటనే అమితాబ్ బచ్చన్ దగ్గర చిరు ఆశీర్వాదం తీసుకున్నారు .ఇప్పటివరకూ తనకి ఎన్ని అవార్డులు వచ్చినా సరే ఏఎన్ఆర్ అవార్డు రావడం తనకి చాలా ప్రత్యేకమని చిరంజీవి చెప్పారు. సాధారణంగా అందరూ ఇంట గెలిచి రచ్చ గెలుస్తారని.. కానీ నేను మాత్రం రచ్చ గెలిచి.. ఇప్పుడే ఇంట గెలిచానంటూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 

Also Read: జగన్‌కు బై..బై! జనసేనలోకి విడదల రజిని!

ఆనాడు కాదు...ఇప్పుడే! 

"నా సినీ కెరీర్‌లో ఎన్నో సినిమాలు చేశాను. కానీ ఎన్ని సినిమాలు చేసినా, ఎంత క్రేజ్ సంపాదించినా ఇంట్లో మా నాన్న నన్ను ఎప్పుడూ కూడా అభినందించలేదు. ఈ విషయంపై చాలా బాధపడేవాడ్ని. ఈ విషయం గురించి అమ్మ దగ్గర మాట్లాడితే... లేదురా పిల్లలను తల్లిదండ్రులు పొగడటం మంచిది కాదు అని మీ నాన్న నిన్ను పొగడరు.. కానీ నీ గురించే ఎప్పుడూ మాట్లాడుతుంటారు అంటూ మా అమ్మ చెప్పింది. అప్పుడు నాకు  ఓహో నేను ఇంట.. రచ్చ కూడా గెలిచానని కూడా అనిపించింది.

కానీ ఇండస్ట్రీ విషయానికొస్తే నేను ఎప్పుడో రచ్చ గెలిచాను.. కానీ ఇంట మాత్రం ఇప్పటివరకూ గెలవలేకపోయాను. అలా గెలిచే అవకాశం ఒకసారి వచ్చింది. తెలుగు సినిమా వజ్రోత్సవ వేడుకల్లో నాకు అందరూ కలిసి లెజెండరీ అవార్డు అందజేశారు. కానీ అది నాకు ఇవ్వడం కొంతమందికి నచ్చలేదు అంటూ చిరు అప్పటి సంగతులను మరోసారి గుర్తు చేసుకున్నారు. దీంతో అసలు ఆనాడు ఏం జరిగింది అనే దాని మీద అంతా చర్చించుకుంటున్నారు.

అసలేం జరిగిందంటే...

వజ్రోత్సవాల వేడుకలో చిరంజీవి లెజండరీ అవార్డు అందుకున్న తరువాత డా.మోహన్‌బాబు వేదిక మీద ప్రసంగించారు. మోహన్‌ బాబు మాట్లాడుతూ '' ఈ వజ్రోత్సవాల వేడుకలో మిమ్మల్ని సన్మానిస్తున్నాం అన్నారు. నేను వద్దన్నాను. అయితే వాళ్లు మీరు లెజెండ్‌ కాదు.. మిమ్మల్ని సెలబ్రిటీగా సన్మానం చేయాలనుకుంటున్నాం అన్నారు. అసలు లెజెండ్‌ అంటే ఏమిటి? సెలబ్రిటీ అంటే ఏమిటి? ముందు మీరు దాని మీద ఓ పుస్తకం తీసుకురండి. సెలబ్రిటీని ఇలా గౌరవించాలి. లెజెండ్‌కు ఇలాంటి క్వాలిటీస్‌ ఉండాలని చెప్పండంటూ'' పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.  

Also Read:  చైనాలో వేలాది స్కూల్స్ మూసివేత.. ఎందుకో తెలిస్తే షాక్

ఆ తరువాత స్టేజీ మీదకి వచ్చిన చిరంజీవి ప్రసంగిస్తూ '' నాకు లెజెండరీ సన్మానం చేస్తా అన్నప్పుడు నేను వద్దన్నాను. ఎందుకంటే డా.డి.రామానాయుడు, డీవీఎస్‌ రాజు, బాపు, దాసరి ఇంత మంది పెద్దల్లో నేను చాలా చిన్నవాడిగా కనిపిస్తాను. వెంకటేష్‌, నాగార్జున, బాలకృష్ణలతో సమానమైనవాడిని. నన్ను లెజెండ్‌ని చేసి వాళ్ల నుంచి దూరం చేయకండి అని చెప్పాను. కానీ అవార్డు నిర్వాహకులు నన్ను కన్వీన్స్‌ చేశారు. కానీ ఇప్పుడు చెబుతున్నాను. ఈ అవార్డును నేను యాక్సెప్ట్‌ చేయడం లేదు. నేను అవార్డును సరెండర్‌ చేస్తున్నాను. 

ఈ అవార్డును, శాలువాను, టైమ్‌ క్యాప్యూల్స్‌ బాక్స్‌లో ఉంచుతున్నాను. తెలుగు సినిమా 100 సంవత్సరాల వేడుకలో అంటే 25 సంవత్సరాల తరువాత నేను అర్హుడిని అని అందరికీ అనిపిస్తే నా తోటి హీరోలందరూ కూడా అది కరెక్ట్‌ అనిపిస్తే వాళ్ల సమక్షంలోనే ఈ అవార్డును తీసుకుంటాను. అప్పటి దాకా ఈ అవార్డును టైమ్‌ క్యాప్యూల్స్‌లో సమాధి చేస్తున్నాను. అప్పటి వరకు సినీ పరిశ్రమలో ఉంటాను.. మీ సేవలు అందుకుంటాను'' అంటూ చిరంజీవి ఆవేశంగా ప్రసంగించి స్టేజీ మీద నుంచి వెళ్లిపోయారు.

Also Read:  గురుకుల విద్యార్థులకు ఆ సదుపాయాలు అందించాలి: మంత్రి పొన్నం

తాజాగా చిరు మరోసారి ఆ అవార్డు గురించి మాట్లాడుతూ.....ఆ అర్హత నాకు ఇప్పుడు వచ్చింది.. ఎందుకంటే లెజండరీ ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు నాకు రావడం.. అది కూడా ఇండియన్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా అందుకోవడం.. ఆహా ఇది కదా అవార్డు అంటే. ఇప్పుడు చెబుతున్నాను.. నేను రచ్చ గెలిచాను.. ఇంట కూడా గెలిచాను." అంటూ చిరంజీవి అన్నారు.

ఇక ఈ కార్యక్రమంలో బిగ్‌బీ మాట్లాడుతూ తెలుగు సినిమాలో భాగం కావడం తన అదృష్టమని.. టాలీవుడ్‌లో తాను కూడా ఒక సభ్యుడిని కావడం నిజంగా గర్వకారణమని అన్నారు. అలానే ఈ సందర్భంగా చిరంజీవి గొప్పతనం గురించి నాగార్జున మాట్లాడారు. ఎంత స్థాయి, ఎంత క్రేజ్, ఎంత అభిమానం ఉన్నా సరే ఆయన ఎప్పుడూ ఇలానే సింపుల్‌గా ఉంటారని.. అదే ఆయన్ను మెగాస్టార్‌ను చేశాయని నాగ్ అన్నారు. ఈ కార్యక్రమానికి బ్రహ్మానందం, రామ్ చరణ్, నాని, శ్రీలీల, సిద్ధు జొన్నలగడ్డ తో పాటు మరికొందరు సెలబ్రెటీలు హాజరయ్యారు.

Also Read:  కిరణ్ అబ్బవరంకు అక్కినేని హీరో సపోర్ట్.. 'క' ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ గా?

Advertisment
Advertisment
తాజా కథనాలు