Ustaad Bhagat Singh: "ఉస్తాద్ భగత్ సింగ్" చూస్తూ కనీళ్ళు పెట్టుకున్న చిరంజీవి.. వీడియో వైరల్!

మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ స్పెషల్ స్క్రీనింగ్‌లో పాల్గొన్నారు. చిరంజీవి సినిమాను ఆస్వాదించి, పాటలు, సన్నివేశాలను ప్రశంసించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

New Update
Ustaad Bhagat Singh

Ustaad Bhagat Singh

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ Pawan Kalyan నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో సందడి చేస్తోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీలీల Sreeleela, రాశి ఖన్నా Raashii Khanna హీరోయిన్లుగా నటించగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చి, మాస్ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యేలా సినిమాను తీర్చిదిద్దారు.

ఇటీవల హైదరాబాద్‌లో ఈ సినిమాకు ప్రత్యేక స్క్రీనింగ్ వేశారు. ఈ షోలో మెగాస్టార్ చిరంజీవి Chiranjeevi, పవన్ కళ్యాణ్, సురేఖ, అన్నా లెజ్‌నేవా, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తాజా వీడియోలో చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమాను ఎంతో ఆసక్తితో చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన సన్నివేశాలను చూడటంలో కొంచెం సిగ్గుపడుతూ కనిపించాడు, అలాగే చిరంజీవి పాటలకు ఫిదా అవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

చిరంజీవి సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని మెచ్చుకున్నారు, ముఖ్యంగా రెండు పాటలను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆయన మాట్లాడుతూ, హరీష్ శంకర్ ప్రత్యేకమైన దర్శకత్వం, పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ రోల్స్ సినిమాకు జీవం పోసినట్టు తెలిపారు. అలాగే, దర్శకుడు, యూనిట్ ప్రతిష్టాత్మకమైన సినిమా ప్రేక్షకులకు అందించిందని, వారి కష్టానికి తగిన ఫలితం దక్కిందని అభినందించారు.

ప్రస్తుతం ఈ ప్రత్యేక స్క్రీనింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, మెగా బ్రదర్స్ కలిసిన క్షణాన్ని అభిమానులు ఆస్వాదిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు