Chinmayi : జ్ఞానపీఠ్ రచ్చ:కమల్ హాసన్ పోస్టు.. చిన్మయి ఫైర్!

ప్రముఖ తమిళ కవి, సినీ గేయ రచయిత వైరముత్తుకు భారతదేశపు అత్యున్నత సాహిత్య పురస్కారం జ్ఞానపీఠ్ వరించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది.

New Update
chinamyi

ప్రముఖ తమిళ కవి, సినీ గేయ రచయిత వైరముత్తుకు భారతదేశపు అత్యున్నత సాహిత్య పురస్కారం జ్ఞానపీఠ్ వరించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. 20 ఏళ్ల తర్వాత ఒక తమిళ రచయితకుఈ గౌరవం దక్కడంపై ఒకవైపు ప్రశంసలు కురుస్తుంటే, మరోవైపు తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా 2018లో వైరముత్తుపై మీటూ ఆరోపణలు చేసిన ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద ఈ నిర్ణయంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

తమిళ సూపర్ స్టార్, రాజకీయ నేత కమల్ హాసన్ వైరముత్తును అభినందిస్తూ చేసిన పోస్ట్‌పై చిన్మయి ఘాటుగా స్పందించారు. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన అధికారం ఉన్న వ్యక్తులు.. తన మెంటర్ ద్వారా వేధింపులకు గురయ్యామని మహిళలు మొత్తుకుంటున్నా వినిపించుకోనట్లు నటిస్తున్నారు. ఓటు వేసే మహిళలంతా ఒక్కటి గుర్తుంచుకోవాలి.. పురుషులు ఎప్పటికీ మన పక్షాన ఉండరు. చివరకు మగవాళ్లంతా వాళ్ల బ్రదర్స్, అంకుల్స్, ఫ్రెండ్స్ వెనకే నిలబడతారు. ఎంతోమంది మహిళలు మానసిక క్షోభ అనుభవించినా వీరికి అనవసరం అంటూ ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

చట్టం ఇలాగే చుట్టమవుతుంది

అంతేకాకుండా, వైరముత్తుపై డీఎంకే పార్టీకి చెందిన మహిళలే లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినా, సీఎం ఎం.కె. స్టాలిన్ ఆయనను అభినందించడాన్ని చిన్మయి తప్పుబట్టారు. "రాజకీయ నాయకులకు సన్నిహితంగా ఉండే వారికి చట్టం ఇలాగే చుట్టమవుతుంది" అని ఆమె ఎద్దేవా చేశారు. గతంలో 2021లో కూడా ఆయనకు కేరళకు చెందిన 'ఓఎన్వీ' (ONV) అవార్డు ప్రకటించినప్పుడు, తీవ్ర వ్యతిరేకత రావడంతో దానిని వెనక్కి తీసుకున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. దివంగత రచయిత జయకాంతన్ కుమార్తె కూడా గతంలో వైరముత్తును విమర్శించిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు.

నిజం మాట్లాడినందుకు తాను తమిళ సినీ పరిశ్రమలో డబ్బింగ్, సింగింగ్ అవకాశాలు కోల్పోయి భారీ మూల్యం చెల్లించుకున్నానని చిన్మయి పేర్కొన్నారు. తన గొంతు నొక్కేయడమే కాకుండా, తనలాగే బాధితులుగా ఉన్న ఎంతోమంది మహిళల కలలు చెదిరిపోయాయని ఆమె ఆరోపించారు. ఒకవైపు సాహిత్య పరంగా వైరముత్తు సాధించిన విజయాలను కొందరు కొనియాడుతుంటే, నైతికత ప్రాతిపదికన ఆయనకు ఈ అవార్డు ఇవ్వడం సరికాదని బాధితుల తరపున గళాలు వినిపిస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు