Movies: వైభవంగా చైతూ–శోభిత పెళ్లి..మురిసిపోయిన నాగార్జున

అన్నపూర్ణ స్టూడియోలో నాగ చైతన్య–శోభితల పెళ్ళి వైభవంగా జరిగింది.  పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో హిందూ సంప్రదాయంలో వీళ్లిద్దరి విహాహం వేడుకగా సాగింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

New Update
11

 అక్కినేని ఇంట పెళ్లి బాజాలు మోగాయి. చైతూ, శోభితల పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగింది. కొద్దిసేపటి క్రితం వధూవరులిద్దరూ పెద్దల సాక్షిగా ఒక్కటయ్యారు. హిందూ సంప్రదాయ పద్ధతిలో అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఈ ముచ్చటైన వేడుకకు పలువురు సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై, వధూవరులను ఆశీర్వదించారు. చిరంజీవి, టి.సుబ్బరామిరెడ్డి తదితరులు వేడుకలో పాల్గొన్నారు. 

సోషల్ మీడియాలో ఫోటోలు..

ఆగస్టులో చైతన్య, శోభితలకు నిశ్చితార్థం అయింది. గత కొన్ని రోజులుగా పెళ్​ళికి ముందు జరిగే ఫంక్షన్ల ఫోటోలతో శోభిత హాడావుడి చేస్తోంది. ఈరోజు పెళ్​ళి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  చైతూ–శోభితలతో పాటూ...నాగార్జున ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. కొత్త జంటతో ఆనందంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు, నాగచైతన్య సోదరుడు, నటుడు అఖిల్‌కు సైతం ఇటీవల నిశ్చితార్థం జరిగింది. వచ్చే ఏడాది వివాహం చేసుకోనునున్నారు. ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ సినిమాతో బిజీగా ఉన్నారు శోభిత కూడా హిందీ, తమిళ్, తెలుగు సినిమాలతో, షోలతో బిజీగా ఉన్నారు. 

11

publive-image

publive-image

ఇక కొత్త కోడలు శోభితను ఆహ్వానిస్తూ నాగార్జున సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కొత్త జంట ఎప్పుడూ ఆనందంగా ఉండాలంటూ ఆయన ఆశీర్వదించారు. శోభిత ఇప్పటికే మా ఇంట్లో వెలుగులను నింపిందని...ఇక మీదట మరిన్ని ఆనందాలను తీసుకువస్తుందని అన్నారు. మా నాన్న గారు ఏఎన్నాఆర్‌ వందవ సంవత్సరంలో ఈ పెళ్ళి జరగడం ఆనందంగా ఉందని...నాగార్జున ఎమోషనల్‌గా రాసుకొచ్చారు. 

1

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు