సైఫ్ అలీ ఖాన్ ఆస్తులు ఇన్నా..? మొదటి భార్యకు భరణమెంత ఇచ్చాడంటే..

సైఫ్ అలీ ఖాన్‌‌పై దాడి చేసిన వారు దొంగతనానికి వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన ఆస్తి విలువ రూ.1200 కోట్లు, రెండవ భార్య కరీనా కపూర్ ప్రాపర్టీ వ్యాల్యూ రూ.485 కోట్లు. అతను రూ.5 కోట్ల భరణం ఇచ్చి ఫస్ట్ వైఫ్ అర్మిత్‌ నుంచి విడాకులు తీసుకున్నాడు.

author-image
By K Mohan
New Update
Saif Ali Khan

Saif Ali Khan Photograph: (Saif Ali Khan)

బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గురువారం దొంగలు చొరబడి కత్తితో అతన్ని దాడి చేశారు. జనవరి 16 తెల్లవారుజామున ముంబై నడిబొడ్డున ఉన్న బాంద్రాలోని ఇంట్లో సైఫ్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే అర్ధరాత్రి సైఫ్ ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు కత్తితో అటాక్ చేయడం సంచలనం రేపుతోంది. సైఫ్ అలీ ఖాన్ సినిమాలోకి రాకముందు నుంచే బాగా సంపన్న కుటుంబం. పటౌడీ నవాబ్ కుటుంబానికి చెందిన వాడు సైఫ్. అతనికి రియల్ ఎస్టేట్, సినిమాలు, బిజినెస్ నుంచి ఆదాయం వస్తోంది. 

ఇది కూడా చదవండి :సైఫ్ కేసులోకి ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు ఎంట్రీ.. వణికిపోతున్న ముంబై మాఫియా!

సైఫ్ అలీ ఖాన్ కి చాలానే ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆయన మొత్తం ఆస్తి విలువ రూ.1200 కోట్లు. అతని రెండవ భార్య కరీనా కపూర్ ఆస్తుల విలువ రూ.485 కోట్లు. సైఫ్ అలీ ఖాన్‌కు హర్యానాలో రూ.800 కోట్లు విలువచేసే పటౌడీ ప్యాలెస్ ఉంది. దాన్ని 2005 నుంచి 2014 వరకు హోటల్ గ్రూప్‌కు లీజ్‌కు ఇచ్చాడు. అంతే కాదు.. ఆయనకు స్విట్జర్లాండ్‌లో రూ.33 కోట్ల ఖరీదైన విల్లా కూడా ఉంది. రూ.2.30 కోట్లు విలువచేసే లగ్జరీ కార్లు ఉన్నాయి.

ఇది కూడా చదవండి : సైఫ్ పై దాడి చేసింది ఇతనే.. బయటికొచ్చిన ఫొటో

బాంద్రాలో ఉన్న సైఫ్ ఇంటి వ్యాల్యూ రూ.103 కోట్లు, అందులో రెండవ భార్య కరీనా కపూర్‌ పిల్లలు తైమూర్, జైహ్‌తో కలిసి ఉంటున్నాడు. ఈ ఇంటిలోనే సైఫ్ పై దాడి జరిగింది. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్‌‌లో కోల్‌కతా టీంకు అతను స్పాన్సర్‌షిప్ ఉన్నాడు. 2004లో సైఫ్ అలీఖాన్ అర్మిత్ సింగ్‌కు విడాకులు ఇచ్చారు. వీరిద్దరికీ సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ పిల్లలు కూడా ఉన్నారు. సైఫ్ రూ.5 కోట్ల భరణం ఇచ్చి అర్మిత్‌ నుంచి విడాకులు తీసుకున్నాడు. తర్వాత బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్‌ను పెళ్లి చేసుకున్నాడు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు