BIG BOSS 8: బిగ్ బాస్ స్టేజ్ పై మెగా హీరో సందడి.. నవ్వులే నవ్వులే..!

బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో మెగా హీరో వరుణ్ తేజ్ 'మట్కా' ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేసినట్లుగా చూపించారు. ఈ ప్రోమోను మీరు కూడా చూసేయండి.

New Update

డబుల్ ఎలిమినేషన్ 

ఇది ఇలా ఉంటే..  ఈ వారం ఊహించని విధంగా డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ ఉందని టాక్. ఈ వీక్ నిఖిల్ హరితేజ, విష్ణు ప్రియా, నిఖిల్, యష్మీ, ప్రేరణ, పృథ్వీ, గౌతమ్ నామినేషన్స్ లో ఉండగా.. హరితేజ ఎలిమినేట్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కొన్ని అనారోగ్య పరిస్థితుల కారణంగా గంగవ్వ కూడా  బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 8 వారాలు పూర్తవగా..  బేబక్క, శేఖర్ భాషా, అభయ్, సోనియా, ఆదిత్య, నైనికా, సీత, మణికంఠ, మెహబూబ్, నయని పావని ఎలిమినేట్ అయ్యారు.  

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Khushbu: స్లిమ్‌గా మారేందుకు ఇంజెక్షన్.. ఖుష్బూ న్యూ లుక్‌పై నెట్టింట రచ్చ రచ్చ!

నటి ఖుష్బూ నెట్టింట తన న్యూ లుక్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఫొటోల్లో ఆమె సన్నగా కనిపించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇంజెక్షన్లతో సన్నబడ్డారు అని ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఖుష్బూ ట్రోలర్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

New Update
actress Khushbu

actress Khushbu

Khushbu:  సీనియర్ నటి, రాజకీయనాయకురాలు ఖుష్భు సుందర్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫొటోల్లో ఖుష్బూ మోడ్రన్ దుస్తులలో అద్భుతమైన లుక్ తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇందులో సన్నగా, స్టైలిష్ కనిపిస్తూ బ్యాక్ టూ ది ఫ్యూచర్ అని క్యాప్షన్ పెట్టారు. అయితే  ఆమె రూపాంతరం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  కొందరు ఆమె సన్నబడడాన్ని ప్రసంశించగా.. మరికొందరు ఆమె బరువు తగ్గడానికి  ఇంజెక్షన్లు తీసుకున్నారు అంటూ ట్రోలింగ్ మొదలు పెట్టారు. ఇంజెక్షన్ల మ్యాజిక్  వల్లే ఇలా మారిపోయారు. వాటి గురించి ఫాలోవర్స్‌కు కూడా చెప్పండి’ అంటూ కామెంట్లు పెట్టారు. 

ఖుష్బూ స్ట్రాంగ్ కౌంటర్ 

కాగా, దీనిపై ఖుష్బూ స్పందింస్తూ ట్రోలర్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీరు అసలు ఎలాంటి మనుషులు? సోషల్ మీడియాలో మీరెప్పుడూ మీ మొహాలు చూపించరు! ఎందుకంటే అంత అసహ్యంగా ఉంటారు కావున మీ తల్లిదండ్రులను చూస్తుంటే జాలి వేస్తుంది అని రీట్వీట్ చేశారు. 

latest-news | telugu-news | cinema-news | senior-actress-khushbu 

Advertisment
Advertisment
Advertisment