Sohel: సోహైల్ ఇంట తీవ్ర విషాదం...! తల్లి మరణంతో దుఃఖంలో మునిగిన నటుడు

బిగ్ బాస్ సీజన్ 4 ఫేమ్ సోహైల్ ఇంట విషాదం చోటుచేసుకుంది. సోహైల్ తల్లి ఫైమాసుల్తానా ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ మెడికవర్ కవర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆమె కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం.

New Update
sohel

sohel

Syed Sohel: బిగ్ బాస్ సీజన్ 4 ఫేమస్ కంటెస్టెంట్ సోహైల్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కొంత కాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న అతని తల్లి ఫైమాసుల్తానా ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ లోని హైటెక్ సిటీ మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారు. డయాలసిస్ నిమిత్తం మెడికవర్ హాస్పిటల్ జాయిన్ అవగా పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. దీంతో సోహైల్, అతని కుటుంబం శోకసంద్రంలో మునిపోయారు. అంత్యక్రియల నిమిత్తం సోహైల్ తల్లి పార్థివ దేహాన్ని స్వస్థలం కరీంనగర్ తరలిస్తున్నారు.

బిగ్ బాస్ సీజన్ 4 ఫేమ్ 

'కొత్త బంగారులోకం' సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సోహైల్ ఆ తర్వాత పలు సినిమాలు, సీరియల్స్ నటించాడు. ఆ తర్వాత 2020 లో బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా వచ్చిన సోహైల్ తన ఆట తీరు, మాట తీరుతో ప్రేక్షకులను మెప్పించాడు. సీజన్ 4లో టాప్ 5 కంటెస్టెంట్ గా నిలిచి ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ క్రేజ్ తో మళ్ళీ హీరోగా తన కెరీర్ మొదలు పెట్టాడు. లక్కీ లక్ష్మణ్, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, మిస్టర్ ప్రెగ్నెంట్, బూట్ కట్ బాలరాజు' వంటి వరుస సినిమాలతో హీరోగా ప్రేక్షకులను అలరించాడు.

Also Read: Johnny Master: కోరిక తీర్చాలని కొట్టారు.. జానీ కేసులో కొత్త ట్విస్ట్!

Advertisment
Advertisment
తాజా కథనాలు