BiggBoss ప్రియాంక సింగ్ ఇంట విషాదం.. తండ్రి చనిపోయారని ఎమోషనల్ పోస్ట్! బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక సింగ్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి బీబీ సింగ్ ఈరోజు తెల్లవారుజామున మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ప్రియాంక సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఎమోషనలైంది. By Archana 22 Oct 2024 in సినిమా Latest News In Telugu New Update bigg boss priyanka singh షేర్ చేయండి Priyanka Singh : బిగ్ బాస్ సీజన్ 5 ఫేమ్ ప్రియాంక సింగ్ ఇంట విషాదం చోటు చేసుకుంది. కొన్ని రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తండ్రి బీబీ సింగ్ ఈరోజు తెల్లవారుజామున ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ విషయాన్ని ప్రియాంక తన సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ భావోద్వేగానికి గురైంది. ప్రియాంకకు ఆమె తండ్రి అంటే చాలా ఇష్టం అనే విషయాన్ని తాను చాలా సందర్భాల్లో చెప్పింది. ఇప్పుడు ఎంతో ఇష్టమైన తన తండ్రి మరణంతో కన్నీటి పర్యంతం అవుతున్నారు ప్రియాంక. Also Read: Sarfaraz Khan : తండ్రైన ఇండియన్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్.. ఇన్స్టాలో పోస్ట్! బిగ్ బాస్ తో ఫేమ్ జబర్దస్త్ షో ద్వారా పరిచయమైన ట్రాన్స్ జెండర్ సాయి తేజ.. కొంతకాలం తర్వాత లింగ మార్పిడీబీ చేయించుకొని ప్రియాంక సింగ్ గా మారాడు. లింగ మార్పిడితో పూర్తి అమ్మాయిగా మారిన సాయి తనను ప్రియాంక సింగ్ గా పరిచయం చేసుకున్నాడు. ప్రియాంక సింగ్ గా బిగ్ బాస్ సీజన్ 5 లో ఎంట్రీ ఇచ్చి భారీ పాపులారిటీ దక్కించుకుంది. ప్రస్తుతం ప్రియాంక పలు టీవీ షోస్, కార్యక్రమాల్లో పాల్గొంటూ అలరిస్తోంది. అయితే ప్రియాంక తాను ట్రాన్స్ జెండర్‌గా మారిన విషయాన్ని మొదట తల్లిదండ్రులకు చెప్పలేదట. చాలా కాలం పాటు వారితో ఈ విషయాన్ని దాచిందట. తాను ట్రాన్స్ జెండర్ అనే విషయం తండ్రికి తెలియాలని బిగ్ బాస్ హౌస్ లో ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. ఆ తరువాత బిగ్ బాస్ వేదికగానే అమ్మాయిగా మారిపోయినట్టు తెలిపారు. ఆ నిర్ణయాన్ని ఆమె తండ్రి కూడా గౌరవించి తనను స్వీకరించారు. Also Read: ఆ కళ్ళు చూస్తే ఎవరైనా చూపు తిప్పుకోలేరు.. వైట్ డ్రెస్ లో హాట్ బేబీ క్యూట్ లుక్స్ న్యూజిలాండ్ మ్యాచ్ లో కీలక పాత్ర Also Read: వామ్మో! అంత ఖరీదైన రిసార్టులో పూజ బర్త్ డే.. ఒక్కరోజుకు ఎన్ని లక్షలంటే? #tollywood #biggboss-season-8 #priyanka-singh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి