వెంకటేష్‌, అనిల్ రావిపూడి మూవీ సెట్స్‌లో బాలయ్య రచ్చ.. వీడియో వైరల్

బాలకృష్ణ, వెంకటేష్‌ ఒకే చోట కలుసుకున్నారు. అనిల్ రావిపూడి – వెంకటేశ్ మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ వేదిక‌గా జ‌రుగుతుండ‌గా.. ఈ షూటింగ్ సెట్స్‌లో బాల‌య్య సంద‌డి చేశాడు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోను మూవీ టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

New Update
balayya venkatesh

టాలీవుడ్ సీనియర్ స్టార్స్ విక్టరీ వెంకటేష్, నందమూరి బాలకృష ఒకే చోట కలుసుకున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత ఈ ఇద్దర్ని ఒకే ఫ్రేమ్ లో చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇంతకీ ఈ సీనియర్ హీరోలు ఎక్కడ కలిశారు? వివరాల్లోకి వెళ్తే.. అనిల్ రావిపూడి - వెంకటేష్ కాంబోలో హ్యాట్రిక్ ఫిలిం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 

ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్ప‌టికే తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో ఉన్న ద‌ర్బార్ హాల్‌లో ఫ‌స్ట్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జ‌రుపుకుంటుంది. అయితే ఈ సెట్స్‌లో నంద‌మూరి బాల‌కృష్ణ వచ్చి అంద‌రికి స‌ర్‌ప్రైజ్ ఇచ్చాడు. అనంత‌రం వెంక‌టేశ్, అనిల్ రావిపూడితో క‌లిసి ముచ్చటించాడు బాల‌య్య.

Also Read : లడ్డూ వివాదం, లిమిట్స్ లో ఉండండి.. ప్రకాష్ రాజ్ కు మంచు విష్ణు వార్నింగ్

బాలయ్య రచ్చ మాములుగా లేదుగా..

ఇక బాల‌య్య సెట్స్‌కి వ‌చ్చిన ఫొటోలతో పాటూ ఓ వీడియోను మూవీ టీమ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకుంది. ఇక వీడియోలో బాలయ్య రచ్చ మాములుగా లేదు. ఆయన సెట్స్ లో అడుగుపెట్టగానే అనిల్ రావిపూడిని సరదాగా ఆటపట్టించడం, ఆ తర్వాత నటీ , నటులను కలుసుకోవడం, వెంకటేష్ తో సరదా సంభాషణ ఇలా తనదైన స్టైల్ లో మూవీ టీమ్ లో హుషారు నింపారు. 

ఈ వీడియోలో బాలయ్య న్యూ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇక అనిల్ రావిపూడి - వెంకటేష్ మూవీ విషయానికొస్తే.. ఇప్ప‌టికే వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన ఎఫ్2, ఎఫ్3 చిత్రాలు మంచి విజ‌యాల‌ను అందుకున్నాయి. ఈసారి మరింత ఎంటర్టైన్మెంట్ తో రాబోతున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. భారీ బ‌డ్జెట్‌తో వ‌స్తున్న ఈ చిత్రం కామెడీ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రానుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు