/rtv/media/media_files/2026/02/19/anirudh-ravichander-live-concert-2026-02-19-16-58-57.jpg)
Anirudh Ravichander Live Concert
Anirudh Ravichander Live Concert: తమిళ రాక్ స్టార్ Anirudh Ravichander హైదరాబాద్(Hyderabad)లో తన తొలి లైవ్ కాన్సర్ట్ కు సిద్ధమవుతున్నారు. ఈ కాన్సర్ట్ పై అభిమానుల్లో ఊహించని స్థాయిలో ఉత్సాహం కనిపిస్తోంది. టికెట్లు బుకింగ్స్ ఓపెన్ కావడంతో వేగంగా బుక్ అవుతున్నాయి.
/rtv/media/post_attachments/7f8cc5a3-52b.png)
ఈ మ్యూజిక్ వేడుకను Sithara Entertainments నిర్వహిస్తోంది. మార్చి 21, 2026న సాయంత్రం 6 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్ హైదరాబాద్లోని Gachibowli Indoor Stadium (అవుట్డోర్ గ్రౌండ్స్)లో జరుగుతుంది. సుమారు నాలుగు గంటల పాటు ఈ షో సాగనుంది.
మొత్తం 30,000 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే 1.5 లక్షలకుపైగా టికెట్ రిక్వెస్టులు వచ్చాయని సమాచారం. దీంతో టికెట్ కోసం భారీ పోటీ నెలకొంది. ప్రీ-రిజిస్ట్రేషన్ చేసిన వారికి ఫిబ్రవరి 19 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రీ-సేల్ ప్రారంభమవుతుంది. సాధారణ అమ్మకాలు ఫిబ్రవరి 20 మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతాయి.
టికెట్ ధరలు ₹2000 నుంచి ₹6000 వరకు ఉన్నాయి. ధరలు ఎక్కువైనా, డిమాండ్ మాత్రం తగ్గలేదు. ఇది అనిరుధ్కు తెలుగులో ఉన్న భారీ ఫాలోయింగ్.
ఈ టూర్కు ‘XV టూర్’ అనే పేరు పెట్టారు. అనిరుధ్ సంగీత ప్రయాణానికి 15 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈ ప్రత్యేక కాన్సర్ట్ నిర్వహిస్తున్నారు. ‘Why This Kolaveri Di’ నుంచి తాజా హిట్ పాటల వరకు ఆయన సంగీత ప్రయాణం ఈ వేదికపై వినిపించనుంది.
మొత్తానికి, హైదరాబాద్లో ఈ కాన్సర్ట్ ఒక పెద్ద మ్యూజిక్ పండుగలా మారనుంది. టికెట్ పొందినవారికి ఇది మరపురాని అనుభవం కానుంది. మరి మీరు టికెట్ బుక్ చేసుకున్నారా..?
Follow Us