Peddi Premieres: పెద్ది ప్రీమియర్స్‌కు గ్రీన్ సిగ్నల్.. టికెట్ ధర ఎంతంటే?

రామ్ చరణ్ "పెద్ది"కు జూన్ 3న ప్రత్యేక ప్రీమియర్ షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు సమాచారం. టికెట్ ధరల పెంపుకూ 10 రోజుల పాటు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇప్పుడు తెలంగాణ నిర్ణయంపై అందరి దృష్టి ఉంది. ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.

New Update
Peddi Premieres

Peddi Premieres

Peddi Premieres: రామ్ చరణ్ నటించిన భారీ చిత్రం "పెద్ది" విడుదలకు ముందు అభిమానుల్లో ఉత్సాహం పెరుగుతోంది. జూన్ 3న నిర్వహించనున్న ప్రీమియర్ షోల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ప్రీమియర్స్‌కు అనుమతి ఇచ్చినట్లు సమాచారం.

అయితే మొదట ఊహించినట్టుగా పలుమార్లు ప్రీమియర్ షోలు కాకుండా, సాయంత్రం 8 గంటల తర్వాత ఒక ప్రత్యేక షో మాత్రమే నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

టికెట్ ధరల పెంపుకూ ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. జూన్ 13 వరకు పది రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేసేందుకు అనుమతి లభించింది. అలాగే మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.125 వరకు టికెట్ ధర పెంచుకోవచ్చు.

ఇప్పుడు అందరి దృష్టి తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై ఉంది. తెలంగాణలో కూడా  కూడా ఇదే తరహాలో టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. ఇటీవల టికెట్ రేట్లపై వివాదాలు జరిగిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం జాగ్రత్తగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

అభిమానులు మాత్రం త్వరగా స్పష్టత రావాలని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సినిమా వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. ఒకవేళ తెలంగాణలో ధరల పెంపుకు అనుమతి రాకపోతే ప్రస్తుతం ఉన్న టికెట్ రేట్లతోనే ప్రదర్శనలు కొనసాగాల్సి ఉంటుంది.

సినీ వర్గాలు "పెద్ది"పై భారీ ఆశలు పెట్టుకున్నాయి. గత కొన్ని వారాలుగా డబ్బింగ్ సినిమాలు మాత్రమే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగాయి. కానీ నేరుగా విడుదలైన చాలా తెలుగు చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి.

ఈ పరిస్థితుల్లో "పెద్ది" మంచి విజయాన్ని సాధించి, థియేటర్లకు మళ్లీ జోష్ తీసుకురావాలని ట్రేడ్ వర్గాలు ఆశిస్తున్నాయి. బాక్సాఫీస్‌కు కొత్త ఊపు ఇచ్చే సినిమాగా ఈ చిత్రాన్ని భావిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు