Amaravathiki Aahwanam: థ్రిల్ పంచుతున్న 'అమరావతికి ఆహ్వానం'

శివ కంఠంనేని, ఎస్తేర్‌, ధ‌న్య బాల‌కృష్ణ‌, సుప్రిత‌ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ 'అమరావతికి ఆహ్వానం' నేడు థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలైంది.

New Update
Amaravathiki Aahwanam

Amaravathiki Aahwanam

Amaravathiki Aahwanam: శివ కంఠంనేని, ఎస్తేర్‌, ధ‌న్య బాల‌కృష్ణ‌, సుప్రిత‌ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ 'అమరావతికి ఆహ్వానం' నేడు థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలైంది. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుంది. ఈ చిత్రానికి జీవీకే దర్శకత్వం వహించారు. మంచి కంటెంట్ ఉన్న హారర్ కథలను ప్రేక్షకులు ఆదరణ ఎప్పుడూ ఉంటుందని ఈ సినిమా మరోసారి నిరూపించిందని రివ్యూవర్స్ చెబుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి రివ్యూ ఇక్కడ చదివేయండి. 

కథ 

ఈ కథలోని ముఖ్య పాత్రలు ఈశ్వర్‌ (శివ కంఠమనేని) ఒక సస్పెండెడ్ సీఐ. అతని వైఫ్ భానుమతి (ధన్య బాలకృష్ణ),  భానుమతి చెల్లి భార్గవి (సుప్రిత). అయితే భార్గవికి చిన్నప్పటి నుంచి పెద్ద సెలబ్రెటీ అవ్వాలనే కోరిక ఉంటుంది. దీని కోసం ఆమె ఒక యూట్యూబ్ ఛానెల్ పెట్టి తన కలను నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో భార్గవి చేసిన ఓ హాంటెడ్ హౌజ్ వీడియో ఫుల్ వైరల్ అవుతుంది. దీంతో ఆమె రాత్రికి రాత్రే పెద్ద సెలబ్రెటీ అయిపోతుంది. ఆ తర్వాత ఓ వ్యక్తి ఆమెకు కాల్ చేసి అమరావతి అనే గ్రామంలో నిజమైన దెయ్యాలు ఉన్నాయని, అక్కడ వీడియో చేస్తే మరింత ఫేమస్ అవుతారని చెప్పడంతో అసలు కథ మొదలవుతుంది. దీంతో బాగా ఎగ్జైట్ అయిన భార్గవి ఫ్యామిలీతో కలిసి అమరావతి అనే గ్రామానికి వెళ్లగా.. అక్కడ ఆమెకు ఎదురైన వింత సంఘటనలు ఏమిటి? అమరావతిలోని జమీందారు వంశ వారసురాలు రాజేశ్వరి(ఎస్తేర్‌)ను చంపింది ఎవరు? రాజేశ్వరి కుటుంబానికి పోలీస్ ఈశ్వర్‌ తో మధ్య ఉన్న సంబంధం ఏంటి?  అతడి సస్పెన్షన్ కి కారణం ఏంటి? అనే ఆసక్తికరమైన అంశాలతో సినిమా సాగుతుంది. 

సినిమా హైలైట్స్ 

సినిమాలో రాజేశ్వరి క్యారెక్టర్‌ ను ఎస్టాబ్లిష్‌ చేసిన విధానం, ఆమె ప్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ ఆసక్తికరంగా సాగుతాయి. ఇక ప్రీ క్లైమా క్స్‌లో వ‌చ్చే ట్విస్ట్‌ ఆడియన్స్‌కు మంచి థ్రిల్ పంచుతుంది. అలాగే హారర్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి.  

నటీనటులు

ఈశ్వర్‌, జగదీశ్  పాత్రల‌లో శివ కంఠంనేని నటన ఆకట్టుకుంది. యాక్షన్‌ సీన్స్‌లోనూ తనదైన మార్క్ చూపించారు. డ్యూయెల్ రోల్‌లో తన పెర్ఫామెన్స్తో మెప్పించారు. నటి ఏస్తేర్‌ ఈ సినిమాకు మరో మెయిన్‌ పిల్లర్‌ గా నిలిచారు. రాజేశ్వరి పాత్రలో ఆమె యాక్టింగ్‌ మెస్మరైజ్ చేశారు.  పద్మనాభ్‌ భరద్వాజ్‌ మ్యూజిక్ అదరగొట్టారు. హార‌ర్ మూడ్ క్యారీ చేస్తూనే పాట‌తో రీఫ్రెష్ మెంట్ ఇచ్చారు. ఇక 'ప్రేమ క‌థా చిత్ర‌మ్' త‌ర్వాత డిఒపి ప్ర‌భాక‌ర్ రెడ్డి  ఈ సినిమాతో మరోసారి తన కెమెరా వర్క్ తో మెప్పించారు. 

మైనస్ పాయింట్స్ 

అయితే  చోట్ల స్టోరీ ప్రిడిక్టబుల్ ఉండడం మైనస్ గా నిలిచింది. సాధారణంగా హారర్ సినిమాల్లో సాంగ్స్ ఉంటే..కథకు స్పీడ్ బ్రేకర్ అనే ఫీలింగ్ కలిగిస్తాయి. ప్రేక్షకులు కూడా పెద్దగా ఇష్టపడరు. కానీ ఈ మూవీ సెకండ్ ఆఫ్ లో కూడా సాంగ్ రావడం కొంతమందికి ఎక్కలేదు. కానీ ఈ సాంగ్ కమర్షియల్ గా బాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. 

మొత్తానికి హారర్, ఫ్యామిలీ, ఎమోషన్, రివెంజ్, థ్రిల్ ఇలా అన్ని అంశాలను కనెక్ట్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. సాధారణ హారర్ సినిమాలకు బిన్నంగా ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా జోడించడం ప్రేక్షకులను మెప్పించింది.  క్లైమాక్స్‌లో  'అమరావతికి ఆహ్వానం 2' అని ప్రకటించి మరింత థ్రిల్ చేశారు మేకర్స్.

Advertisment
తాజా కథనాలు