అర్హ తెలుగు పద్యానికి బాలయ్య ఫిదా.. 'అన్ స్టాపబుల్' న్యూ ప్రోమో వైరల్ ‘అన్‌స్టాపబుల్’ సీజన్ 4' మరో ఎపిసోడ్ ప్రోమోను ఆహా విడుదల చేసింది. అందులో బన్ని పిల్లలు అయాన్, అర్హ సందడి చేశారు. అర్హా తెలుగులో పద్యం పాడగా.. బాలకృష్ణ ప్రశంసించారు. ఇందుకు సంబంధించిన ప్రోమో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. By Anil Kumar 19 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి 'పుష్ప 2' ప్రమోషన్స్ లో భాగంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..ఇటీవల బాలయ్య 'అన్ స్టాపబుల్' సీజన్ 4 లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి పార్ట్-1 ఎపిసోడ్ ఇప్పటికే 'ఆహా' లో స్ట్రీమింగ్ అవుతుండగా.. తాజాగా పార్ట్-2 ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో అల్లు అర్జున్‌తో పాటు కొడుకు అయాన్, కూతురు అర్హ షోలో కనిపించారు. హోస్ట్ బాలకృష్ణ.. అర్హ నీకు తెలుగు వచ్చా.. అని అడిగేసరికి అర్హ.. పదో క్లాస్‌లో చాలామంది చదువుకున్న 'అటజనికాంచె భూమిసురు డంబరచుంబి..' అనే క్లిష్టతరమైన పద్యాన్ని ఆపకుండా అవలీలగా చెప్పేసింది. దీంతో అర్హ టాలెంట్ కు బాలయ్య ఫిదా అయిపోయాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. Part 1 tho Jathara chupinchamu , Part 2 Tho jathara mass chustaru 🥵. Get ready to watch Wildfire episode from Nov 22.#Unstoppable #iconstar #AlluArjun𓃵 #Ayaan #arha #UnstoppableWithNBK #AlluArjunOnAha #Pushpa2TheRule #DaakuMaharaaj #WildFire #Fahadfaasil #Rashmika… pic.twitter.com/nCksm5gzZH — ahavideoin (@ahavideoIN) November 19, 2024 Also Read : తనకంటే 20 ఏళ్ళు చిన్నవాడితో 'పవన్' హీరోయిన్ డేటింగ్.. అతని కౌగిలిలో ఒదిగిపోతూ జాతర మాస్ చూస్తారు.. కాగా ఇదే ప్రోమోలో వ్యక్తిగత విషయాలతో పాటు 'పుష్ప 2' గురించి అల్లు అర్జున్-హోస్ట్ బాలకృష్ణ మాట్లాడుకున్నారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌కి కూడా ఫోన్ చేసి మూవీ గురించి మాట్లాడారు. చివరలో బన్నీ మాట్లాడుతూ.. ఇప్పటివరకు మాస్ చూశారు, ఊరమాస్ చూశారు.. 'పుష్ప 2'తో జాతర మాస్ చూస్తారని ఓ రేంజ్ లో ఎలివేషన్ ఇస్తూ చెప్పాడు. నవంబర్ 22 శుక్రవారం రోజున ఈ ప్రోమో తాలూకూ ఫుల్ ఎపిసోడ్ 'ఆహా' ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. Also Read: 'పుష్ప' అంటే నేషనల్ అనుకుంటిరా? ఇంటర్నేషనల్.. పుష్ప2 ట్రైలర్ అరాచకం..! #allu-arjun #allu-arha #balakrishna-unstoppable మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి