/rtv/media/media_files/2026/03/24/aditya-dhar-2026-03-24-12-19-20.jpg)
Aditya Dhar
Aditya Dhar: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘పుష్ప’ ఫ్రాంచైజీతో పాన్ ఇండియా స్టార్‌డమ్‌కి చేరుకున్న బన్నీ ఇప్పుడు తన కెరీర్‌ను మరొక స్థాయికి తీసుకెళ్ళే ప్లాన్‌లో ఉన్నాడు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ ఆదిత్య ధర్ తో కలిసి రాబోయే ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా గ్లోబల్ లెవెల్‌లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.
ఇక అదే సమయంలో బాలీవుడ్‌లో హిట్ సెన్సేషన్ ‘ధురంధర్ 2’ (Dhurandhar: The Revenge) బాక్సాఫీస్‌లో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. రణ్ వీర్ సింగ్ Ranveer Singh హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్-స్పై థ్రిల్లర్ దేశభక్తి భావనను స్టైలిష్‌గా చూపిస్తూ నాలుగు రోజుల్లోనే భారీ వసూలు చేసింది.
ప్రపంచవ్యాప్తంగా ఈ నాలుగు రోజుల్లో సుమారు రూ.750 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించడం విశేషం. రిలీజ్‌కు ముందే పెయిడ్ ప్రివ్యూల ద్వారా రూ.43 కోట్లు వసూలు చేసిన సినిమా, తరువాత రోజురోజుకు వసూలు పెంచుకుంటూ వెళ్లింది. ప్రత్యేకంగా ఆదివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా రూ.115 కోట్ల వసూలు చేయడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.
‘ధురంధర్ 2’ పాఠాన్ ఓపెనింగ్ వీకెండ్ రికార్డ్ రూ.287 కోట్లను సులభంగా అధిగమించింది. ఓవర్సీస్‌లో కూడా రూ.180 కోట్ల వసూలుతో గ్లోబల్ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది.
ఈ సక్సెస్ చూసిన అల్లు అర్జున్, సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని షేర్ చేసారు: “Patriotism with Swag… ప్రతి భారతీయుడు గర్వపడే సినిమా.” ఆయన ఈ కామెంట్స్‌తో ఆదిత్య ధర్ కృతజ్ఞతను తెలియజేశారు. రణ్ వీర్ సింగ్ పెర్ఫార్మెన్స్‌ను ప్రశంసించారు, “ఇండియన్ సినిమాకు ఇలాంటి దర్శకుడు ఉండటం గర్వకారణం” అని అన్నారు.
ఈ ట్వీట్‌తోనే అల్లు అర్జున్ - ఆదిత్య ధర్ కాంబినేషన్‌పై పుకార్లు బలపడ్డాయి. గతంలో అశ్వద్ధామ్ కోసం కూడా ఇద్దరి మధ్య చర్చలు జరగగా, అధికారిక ప్రకటన రాలేదు, బన్నీ రెస్పాన్స్ చూసి ప్రాజెక్ట్ నిజమయ్యే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే, ఈ సినిమా సింగిల్ హీరోగా వస్తుందా లేక మల్టీ-స్టారర్‌గా వస్తుందా అనే ఆసక్తి తీవ్రంగా ఉంది. రూమర్స్ ప్రకారం, జూనియర్ ఎన్టీఆర్ కూడా కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉంది. ఇది నిజమైతే, పాన్ ఇండియా -పాన్ వరల్డ్ స్థాయిలో భారీ సెన్సేషన్ అయ్యే అవకాశముంది.
అదేవిధంగా, ఆదిత్య ధర్ రామ్ చరణ్‌తో కూడా మరో ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇలా ‘ధురంధర్ 2’ సక్సెస్‌తో, ఆదిత్య ధర్ రేంజ్ పెరగడం, స్టార్ హీరోలు ఆయనతో పని చేయాలనే ఆసక్తి చూపించడం స్పష్టంగా కనిపిస్తోంది.
ఇక ఈ అల్లు అర్జున్ - ఆదిత్య ధర్ కాంబినేషన్ నిజంగా వర్కౌట్ అవుతుందా, సింగిల్ హీరో మూవీగా వస్తుందా లేదా మల్టీ-స్టారర్‌గా సర్‌ప్రైజ్ ఇస్తుందా అన్నది అధికారిక ప్రకటన వరకు వేచి చూడాల్సి ఉంది.
Follow Us